Begin typing your search above and press return to search.

కొలుసు... రాజ‌కీయాలు.. పులుసు కారుతున్నాయా..?

By:  Tupaki Desk   |   4 Dec 2022 4:30 AM GMT
కొలుసు... రాజ‌కీయాలు.. పులుసు కారుతున్నాయా..?
X
ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌వ‌ర్గం.. పెన‌మ‌లూరు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి గెలిచిన కొలుసు పార్థ‌సార‌థి.. వైసీపీలో మంత్రి ప‌ద‌విని ఆశించిన విష‌యం తెలిసిందే. యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యారు. వాస్త‌వానికి పార్టీ పెట్టిన‌ప్పుడు ఈయ‌న రాలేదు. పైగా.. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్‌ను విమ‌ర్శించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

దీంతోనే మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే టాక్ కూడా ఉంది. క‌ట్ చేస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నారా? లేదా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. పార్టీ చెబుతున్న కా ర్య‌క్ర‌మాల‌ను ఆయ‌న ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. క‌నీసం గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మాన్ని కూడా ఆయ‌న సీరి యస్‌గా తీసుకోలేదు. కొన్ని రోజుల పాటు ఇళ్ల‌కు తిరిగినా.. ప్ర‌జ‌ల నుంచి కొన్ని ప్రశ్న‌లు ఎదురు కావ‌డం తో త‌ప్పుకొన్నారు.

నిజానికి తొలి ద‌శ మంత్ర వ‌ర్గం స‌మ‌యంలో నిత్యం మీడియా ముందుకు వ‌చ్చి అధికార పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసినంత దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన పార్థ‌సార‌థి.. త‌ర్వాత మాత్రం ఫుల్లుగా సైలెంట్ అయిపో యారు. ఇక‌, ఇప్పుడు కూడా ఆయ‌న పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌ని.. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీనిపై అధిష్టానం.. ఇటీవ‌ల ఫోన్ ద్వారా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

దీనిపై సానుకూల‌త వ్య‌క్తం చేసినా.. కొలుసు మాత్రం పొరుగు పార్టీవైపు దృష్టి పెట్టార‌నే చ‌ర్చ సాగుతుండ డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ఒక కీల‌క పార్టీతో ఆయ‌న ట‌చ్‌లో ఉన్నార‌ని.. ఆపార్టీ త‌ర‌ఫున ఆయ‌న పోటీ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని నియోజ‌క‌వర్గంలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ అధిష్టానం సీరియ‌స్ అయితే.. కొలుసుకు పులుసు కార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు సీనియ‌ర్లు.