Begin typing your search above and press return to search.

టీడీపీ సీఎం అభ్యర్ధిగా భువనేశ్వరి... ?

By:  Tupaki Desk   |   27 Nov 2021 7:37 AM GMT
టీడీపీ సీఎం అభ్యర్ధిగా భువనేశ్వరి... ?
X
చంద్రబాబు రాజకీయాల్లో చాలా చూశారు. ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఈ రోజుకు చూసుకుంటే ఆయన కంటే ఎక్కువ కాలం సీఎం గా పాలించిన వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలు టీడీపీకి పెను సవాల్ లాంటివి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఫ్యూచర్ ఏంటో విశ్లేషకులు చెప్పనవసరం లేదు, ఆ పార్టీ వారికే బాగా తెలుసు. అందువల్ల సర్వశక్తులు ఒడ్డి మరీ టీడీపీ గెలవాలని చూస్తోంది. దాంతో ఇపుడు ఏ చిన్న విషయం అయినా రాద్ధాంతం చేసి సానుభూతి పొందాలని చూస్తోంది.

అందులో భాగమే భువనేశ్వరి ఎపిసోడ్. ఈ విషయంలో చంద్రబాబు ఎక్కువే చేస్తున్నాడు అన్నది వైసీపీ నేతల మాట మాత్రమే కాదు, మేధావుల మాట కూడా. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా చంద్రబాబు ఈ విషయంలో చేసిన దాన్ని తప్పుపడుతున్నారు. చంద్రబాబు పెద్ద మనిషిగా ఆ విషయాన్ని అసెంబ్లీనా నాలుగు గోడల మధ్యనే ముగించి ఉండాలని కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఇపుడు దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే భువనేశ్వరి ఎన్టీయార్ కుమార్తె. ఎన్టీయార్ తెలుగు వారి ఆరాధ్య దైవం.

అందువల్ల ఆయన ఫ్యామిలీని ఏమైనా అంటే తెలుగు జనాల స్పందన భిన్నంగా ఉంటుందని, అది తమకు సానుభూతిగా మారి ఓట్ల వర్షం కురిపిస్తుంది అన్న అంచనాల్లో బాబు ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఆయన తెలుగు ఆడపడుచుల ఆత్మ గౌరవం పేరిట ఏపీ వ్యాప్తంగా కార్యక్రమాలు, నిరసలనకు పిలుపు ఇస్తున్నారు. సరే అది ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికే భువనేశ్వరిని రాజకీయంగా బయటకు తెచ్చి ఏపీ జనాల్లో ఆమెపై ఫోకస్ ఉండేలా బాబు చూస్తున్నారు.

ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో భువనేశ్వరిని స్టార్ కాంపెనియర్ గా ముందుకు ఏపీలో టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని చేయించాలని బాబు చూస్తున్నారని అంటున్నారు. అంతే కాదు ఆమెతో పాటు ఎన్టీయార్ కుమార్తెలను కూడా ప్రచారంలో ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఇంతలా ఎన్టీయార్ ఫ్యామిలీ మీద అధారపడుతున్నా బాబు పాతికేళ్ల క్రితం ఆ మహానుభావుడికి చేసిన అన్యాయానికి బదులుగా ఇప్పటికైనా ఆ ఫ్యామిలీ వారికి అధికార పదవి ఇస్తామని చెబితే ఎంతో కొంత రాజకీయంగా మేలు జరిగే చాన్స్ ఉంటుంది అంటున్నారు.

ఎవరూ కాదు, తన సతీమణి భువనేశ్వరిని టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బాబు ప్రకటిస్తే అపుడు కచ్చితంగా ఎన్టీయార్ ఫ్యాన్స్ టర్న్ అయ్యే చాన్స్ ఉంది అంటున్నారు. అవన్నీ పక్కన పెట్టి కేవలం ప్రచారానికీ సానుభూతికే ఎన్టీయార్ కుటుంబాన్ని వాడుకుని తానే సీఎం అవుతాను అని బాబు అంటే అందులో కొత్త ఏముంది అని జనాలు పట్టించుకోకపోతే టీడీపీకే పెద్ద దెబ్బ. మరి బాబు తన భార్యను అయినా ఈసారి టీడీపీ తరఫున ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పగలరా. ఎందుకంటే ఆమెనే కదా వైసీపీ వారు టార్గెట్ చేసింది. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఉంటుంది మరి.