ఘనంగా పెళ్లి .. వధువు ఒడిలో ల్యాప్‌టాప్ ...అసలేమైందంటే !

Tue Jul 07 2020 15:45:04 GMT+0530 (IST)

Laptop on the bride lap

కరోనా వైరస్ పుణ్యమా అని  ప్రొఫెషనల్స్ టెక్నాలజీ వాడకం బాగా పెరిగిపోయింది. మహమ్మారి కారణంగా ఆఫీసులకి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో  వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ... ల్యాప్ టాప్ లలోనే పని కానిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. పెళ్లిళ్ల విషయంలోనూ అంతే పెళ్లికి వెళ్లకపోయినా ఆన్ లైన్ లో ఎంట్రీ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పి సరిపెట్టేస్తున్నారు.సి పని మానలేం అలాగని కరోనాకు ఛాన్స్ ఇవ్వలేం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన రోజులు వచ్చాయి.అయితే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండూ వేరువేరు. ఆ రెండింటినీ కలిపితే సమస్యే. కొంతమంది మాత్రం పర్సనల్ లైఫ్ లో కూడా ప్రొఫెషన్ ను తెచ్చుకొని ఇబ్బంది పడతారు. తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో వధువు వరుడి పక్కన కూర్చొని ఒళ్లో ల్యాప్ టాప్ పెట్టుకొని పనిచేసుకుంటోంది. గ్రాండ్ మ్యారేజ్. కాస్ట్‌లీ కాస్ట్యూమ్స్ అంతా సందడిగా ఉంటే ఆమె మాత్రం  ఓవైపు ఫోన్ లో మాట్లాడుతూ  మరోవైపు ల్యాప్ టాప్ లో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంది.

పెళ్లి సందర్భంగా ఫ్రెండ్స్ కంగ్రాట్స్ చెబుతుంటే వరుడి సంగతి వదిలేసి అందులో మునిగిపోయింది. చాలా మంది ఈ వీడియో చూసి... ఆమె అలా చెయ్యడం కరెక్టు కాదంటున్నారు. జీవితంలో ఒకేసారి వచ్చే పెళ్లిని ఎంజాయ్ చెయ్యడం మానేసి ఆ ప్రొఫెషన్ గోల ఏంటని అంటున్నారు. ఐతే . కచ్చితంగా ఆమె ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తోందన్నది తెలియలేదు. చాలా మంది జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటోందని అంటున్నారు. పెళ్లి కొడుకు మాత్రం ఆమెపై చూస్తూ అలాగే ఉండిపోయాడు.