Begin typing your search above and press return to search.

తెలంగాణలో భయపెడుతున్న మరో కొత్త వైరస్ !

By:  Tupaki Desk   |   6 Jun 2020 9:51 AM GMT
తెలంగాణలో భయపెడుతున్న మరో కొత్త వైరస్ !
X
ఇప్పటికే ఒకపక్క ప్రపంచ దేశాలను ఈ వైరస్ వణికిస్తుంటే , తెలంగాణలో ఈ మహమ్మారికి తోడు కొత్త రకం వైరస్ భయపెడుతుంది. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఏ కొత్త వైరస్ వ్యాధి జంతువుల ఉసురు తీస్తుంది. కేవలం తెల్ల పశువులకే సోకుతున్న ఈ వైరస్‌ లంపి స్కిన్‌ గా ఇటీవలె పశుసంవర్ధకశాఖ అధికారులు నిర్ధారించారు. ఇదివరకే ఈ విషయంపై రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాలో పర్యటించి నమూనాలు సేకరించి ఇది కౌ ఫాక్స్‌ వైరస్‌ లాంటిదేనని, కానీ రాష్ట్రంలో కొత్తగా బయటపడినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు వెల్లడించారు.

వైరస్‌ సోకిన పశువుల్లో దద్దుర్ల తీవ్రత ఎక్కువగా ఉంటే తప్పా మరణాలు సంభవించవని ప్రకటించారు. ఇటీవల మదనాపురం మండలం అజ్జకోలులో వారం రోజుల్లో రూ.లక్షలు విలువ చేసే ఏడు పశువులు మృతి చెందటం, మరో మూడు పశువులు గత పదిహేను గంటలుగా మృత్యువుతో పోరాడటం చర్చనీయాంశంగా మారింది . లాక్‌ డౌన్‌కు ముందు నుంచే.. జిల్లాలోని పెబ్బేర్, ఖిల్లాఘనపురం, పెద్దమందడి, మదనాపురం, కొత్తకోట, పాన్‌గల్‌ తదితర ప్రాంతాల్లో ఈ వైరస్‌ భారిన పశువులు పడినట్లు వైద్యాధికారుల నివేదిక ద్వారా వెల్లడవుతోంది.

ఇప్పటి వరకు లంపి స్కిన్‌ వైరస్‌ భారిన జిల్లా వ్యాప్తంగా సుమారు 3,500 పశువులు పడినట్లు అధికారులు వెల్లడించారు. కౌ ఫాక్స్‌ తరహాలోని ఈ వైరస్‌ సోకిన పశువుల్లో వంటిపై దద్దుర్లు, గొంతువాపు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా జిల్లాలోని మదనాపురం మండలం అజ్జకొల్లులో రాజవర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలరాజు రైతులకు చెందిన పశువుల్లో కొన్నింటికీ లంపీ స్కిన్‌ వైరస్‌ సోకింది. దీంతో కొత్తకోట పశువైద్యాధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్‌ పెన్సిలిన్‌ తో పాటు ఐసోప్లడ్‌ ఇంజక్షన్, గ్లూకోజ్‌ ఇచ్చాడు. అనంతరం మూడు రోజుల అనంతరం మొత్తం ఆరు పశువులతోపాటు ఒక కోడె సైతం మృతిచెందాయి. మరికొన్ని మృత్యువుతో పోరాడుతుండగా.. వాటికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

పశువుల మృతి నేపథ్యంలో తెలంగాణ స్టేట్‌ వెటర్నరి అండ్‌ బయోలాజికల్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ దేవేందర్‌రావు, డాక్టర్‌ యం. కళ్యాణి వారి బృందంతో కలిసి శుక్రవారం అజ్జకొల్లును సందర్శించి మృత్యువుతో పోరాడుతున్న పశువులను పరిశీలించారు. వాటి నుంచి మలమూత్రం, రక్తంతో పాటు లాలాజలం నమూనాలను సేకరించారు. అలాగే, మృతి చెందిన పశువుకు పోస్టుమార్టం నిర్వహించి కొన్ని నమూనాలను సేకరించారు. వీటిని హైదరాబాద్‌ ల్యాబ్‌లో పరీక్షించి పశువులు మృతి చెందటానికి గల కారణం వైరస్‌.. లేక హై డోస్‌ మెడిసిన్‌ ఇవ్వటం వలనా అనే విషయం వెల్లడిస్తామన్నారు. అలాగే ఈ వైరస్‌కు మందు లేదు అని , ఉన్న మెడిసిన్‌ వాడుతూ.. పశువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అని తెలిపారు.