Begin typing your search above and press return to search.

ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత .. ఆరంభం లోనే అదరగొట్టేశాడు

By:  Tupaki Desk   |   28 Oct 2021 6:24 AM GMT
ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత .. ఆరంభం లోనే అదరగొట్టేశాడు
X
కేసులు.. కోర్టు.. జైలు.. ఇలా ఒక పార్టీ అధినేతకు పెద్ద వయసులో ఇలాంటివి ఎదురైతే అంతకు మించిన కష్టం ఇంకేం ఉంటుంది. అయిన ప్పటికీ అలాంటి ప్రతి కూలతల్ని ఎదుర్కొని మరీ నిలదొక్కుకోవటం అందరి కి సాధ్యమయ్యేది కాదు. ఆ విషయం లో తాను మిగిలిన వారికి కాస్త భిన్నమనే మాట ను చేతల్లో చూపించారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. దాదాపు ఆరేళ్లు గా జైల్లో ఉంటూ.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం గా ఉండటమే కాదు.. ఒక దశ లో తీవ్ర అనారోగ్యానికి గురై.. ఆసుపత్రి లో చావు బతుకుల మధ్య పోరాడిన ఆయన తిరిగి ఆరోగ్యం గా బయటకు వచ్చారు. దాణా స్కాం లో జైలు పాలైన లాలూ జైలు శిక్ష అనుభవిస్తూ.. తాజాగా బెయిల్ మీద బయట కు రావటం తెలిసిందే.

సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. బిహార్ లోని నితీశ్ సర్కారు మీదా.. కేంద్రం లోని మోడీ సర్కారు మీదా ఘాటు వ్యాఖ్యలు చేశారు. విరామం వచ్చినా తన మాటల్లో ఘాటు తగ్గలేదన్న విషయాన్ని తాజాగా నిర్వహించిన సభ లో మాట్లాడిన ఆయన చెప్పకనే చెప్పేశారు. తారాపూర్ పార్టీ అభ్యర్థికి మద్దతు గా నిర్వహించిన భారీ ర్యాలీ లో పాల్గొన్న ఆయన.. అనంతరం జరిగిన సభ లో ప్రసంగించారు.

బిహార్ కు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి బీజేపీ తో జత కట్టిన నితీశ్ ఇప్పుడు ముఖం చాటేశారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు లేదని స్పష్టం చేసిన ఆయన ఆర్జేడీ ఒంటరి గా పోటీ చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో పొత్తు ఉండదని లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ వ్యాఖ్యలు చేసిన సందర్భం లోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లాలూకు ఫోన్ చేశారు.

అనంతరం లాలూ కాంగ్రెస్ కు సుదీర్ఘకాల మిత్రుడని.. ఆయన తో స్నేహ బంధం కొనసాగించాలని పార్టీ నేతలకు సోనియా గాంధీ స్పష్టం చేయటం గమనార్హం. ఇది లా ఉండగా.. బిహార్ ప్రజలు నితీశ్ ప్రభుత్వాన్ని త్వర లోనే గంగలో కలిపేస్తారన్న లాలూ.. కేంద్రం లోని మోడీ సర్కారును వదల్లేదు. బీజేపీ దేశాన్ని అమ్మడమే పని గా పెట్టుకుందని.. రైల్వేలు.. ఎయిర్ పోర్టులు.. పోర్టుల ను అమ్మేస్తుందన్నారు. తాను బిహార ప్రజల తరఫున పోరాడేందుకు వచ్చినట్లు చెప్పారు. తాను జైల్లో ఉన్న కారణం గా నితీశ్ దొంగ దారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని.. తానే కనుక బయట ఉండి ఉంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు కాదన్నారు. ఆరేళ్లు గా జైల్లో ఉన్నప్పటి కీ లాలూ మాట లో మాత్రం చురుకు తగ్గకపోవటం గమనార్హం.