Begin typing your search above and press return to search.

అలా చేస్తే వీర్యకణాల నాణ్యత దెబ్బతింటుందా?

By:  Tupaki Desk   |   4 Dec 2021 2:59 AM GMT
అలా చేస్తే వీర్యకణాల నాణ్యత దెబ్బతింటుందా?
X
నిద్ర తక్కువైతేనే కాదు.. ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు చైనా పరిశోధకులు గుర్తించారు.

మారుతున్న పరిస్థితులు మరియు మారుతున్న ఆహారపు అలవాట్లు ఇతరత్ర కారణాల వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం తగ్గుతుందని చెప్పుకోక తప్పడం లేదు.

మన తాతలు, వారి తండ్రులు ఒక్కొక్కరు డజన్ల కొద్ది పిల్లల్ని కన్నారు. కాని ఇప్పుడు మాత్రం ఒక్కరు లేదా ఇద్దరిని కనేందుకు కూడా మగవారిలో స్టామినా సరిపోవడం లేదు.ఈ విషయం మేము చెబుతున్నది కాదు ఒక అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చేసిన సర్వేలో వెళ్లడైన విషయం. అవును గత 10 సంవత్సరాల్లో పురుషుల వీర్యంలో శుక్రకణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లుగా ఆ సర్వేలో వెళ్లడైంది.

ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు. అనంతరం వీర్యకణాల సంఖ్య, రూపు, కదలికలను పరిశీలించారు.

వీరందరిలో కెల్లా 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు తేలింది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోవటం గమనార్హం.

నిద్రతగ్గినా, ఎక్కువ అయినా వీర్యకణాలపై ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 6గంటల కంటే తక్కువ నిద్ర, 9 గంటల కంటే ఎక్కువ సేపు పడుకునే వారిలో వీర్యం క్వాలిటీ పడిపోవడం గుర్తించారట.. ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి లేకపోవటం చాలా హానికరం.

ఎందుకంటే వీరిలో ఆరోగ్యకరమైన వీర్యకణాలను దెబ్బతీసే ప్రోటీన్‌ (యాంటీస్పెర్మ్‌ యాంటీబాడీ) స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవటం, అదీ త్వరగానే పడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కాబట్టి పడుకోవటానికి కనీసం 2 గంటల ముందే భోజనం చేయటం.. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్ల వంటివి కనీసం 45 నిమిషాల ముందే కట్టేయటం.. నిద్ర పోవటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం.. గదిలో ప్రకాశవంతమైన లైట్లు లేకుండా చూసుకోవటం.. మనసుకు నచ్చిన సంగీతాన్ని వినటం.. వదులుగా ఉండే దుస్తులు ధరించటం..వంటి వాటితో నిద్ర బాగా పట్టేలా చూసుకోవచ్చు.