‘వన్ నేషన్.. వన్ టీకా’ ఏదీ మోడీజీ?

Thu Apr 22 2021 13:03:44 GMT+0530 (IST)

Ktr Fires On Central Govt

కేంద్రంలోని ప్రధాని మోడీ పక్షపాతాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కరోనా వైరస్ విషయంలో కేంద్రం తీరును ఆయన ఎండగట్టారు. కరోనావైరస్ వ్యాక్సిన్ ధర ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య చిచ్చుపెడుతున్నాయి. కరోనా టీకా విక్రయిస్తున్న రేట్లు రాజకీయ విమర్శలను ఎదుర్కొన్నాయి.తెలంగాణ మంత్రి కేటీఆర్ టీకా రేట్ల వ్యత్యాసాలపై మోడీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. వ్యాక్సిన్ కంపెనీలు ప్రతి మోతాదును రూ.150కే కేంద్రానికి.. రూ.400 చొప్పున రాష్ట్రాలకు ఇవ్వడం ఏంటని కేటీఆర్ అన్నారు. ఈ వివక్ష ఏంటని మోడీ సర్కార్ ను కేటీఆర్ నిలదీవారు.

‘వన్ నేషన్ వన్ టాక్స్’ వ్యవస్థకు అన్ని రాష్ట్రాలు ఎలా అంగీకరించాయో.. అలాగే అన్ని రాష్ట్రాలకు కేంద్రానికి ఇచ్చినట్టు తక్కువ ధరకే ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ‘వన్ నేషన్.. వన్ టీకా’ నినాదాన్ని పైకి తీసుకొచ్చారు. మోడీ అంటున్న  ‘వన్ నేషన్ - వన్ రేషన్’ వ్యవస్థను లాగా అందరికీ సమానంగా టీకాలు వేయాలని సూచించారు. టీకా మోతాదు పంపిణీలో ఏకరీతిగా అందరికీ పంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

పీఎం కేర్స్ లో భాగంగా టీకా కోసం అదనపు ఖర్చును కేంద్రం భరించలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని జనాభా మొత్తానికి టీకాను అందించే బాధ్యత కేంద్రానికి ఉందని కేటీఆర్ అన్నారు. టీకా డ్రైవ్ వేగవంతం చేయడానికి మోడీ పాలన ఎప్పుడు సహకరించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. టీకాల డిమాండ్ ఇప్పుడు పెరిగిందని.. అన్ని వయసుల వారు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. జనాభాలో 80 శాతం.. అంతకు మించిన వారికి వీలైనంత త్వరగా పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఇది మాత్రమే వైరస్ ను నియంత్రించగలదని.. ప్రజలందరికీ రోగనిరోధక శక్తి వస్తుందని కేటీఆర్ అన్నారు.