Begin typing your search above and press return to search.

మోకా హత్య : కాల్‌ డాటా ఆధారంగానే కొల్లు అరెస్ట్ : ఎస్పీ

By:  Tupaki Desk   |   4 July 2020 10:50 AM GMT
మోకా హత్య : కాల్‌ డాటా ఆధారంగానే కొల్లు అరెస్ట్  : ఎస్పీ
X
వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కర్‌రావును అతికిరాతకంగా హత్య చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ హత్య రాజకీయ ఆధిపత్యం కోసమే చేశారని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. 2013లో కూడా భాస్కర్ ‌రావు హత్యకు కుట్ర జరిగిందని అన్నారు. గడిచిన నాలుగు నెలలుగా భాస్కర్‌ రావు హత్యకు పలుమార్లు ప్రయత్నించారని చెప్పారు. ఎస్పీ రవీంద్రబాబు శనివారం హత్యకేసు వివరాలను మీడియాకు వివరించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాన నిందితుడు నాంచారయ్యకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అండ ఉంది. హత్యా ఘటనకు 15 రోజుల ముందు రవీంద్రను నాంచారయ్య కలిశారు. ఒక రూమ్‌ లో దాదాపు గంట సేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు. భాస్కర్‌ రావు హత్యకు ప్రయత్నిస్తున్నట్లు నాంచారయ్య రవీంద్రకు చెప్పారు. తన పేరు బయటకు రాకుండా ప్లాన్ చేయాలని రవీంద్ర స్పష్టం చేశారు. ఆ సమయంలో ఆయన పీఏ కూడా ఉన్నారు.

చేపల మార్కెట్ ‌కు భాస్కర్ ‌రావు ఒంటరిగా వస్తున్నారని గుర్తించి పథకం ప్రకారం హత్య చేశారు. నాలుగు రోజుల ముందు నుంచే హత్య ఎలా చేయాలో నిందితులకు ట్రైనింగ్ ఇచ్చారు. దాడి చేసిన తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న బైక్ల పై నిందితులు పరారయ్యారు. ప్రధాన నిందితుడు నాంచారయ్య ఇచ్చిన వాంగ్మూలంతో పాటు.. కాల్‌ డాటా ఆధారంగా విచారణ చేసిన తర్వాతే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశాం. కొల్లు రవీంద్రకు నోటీసులు ఇవ్వడానికి వెళితే ఆయన పరారయ్యారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై తుని వద్ద ఆయనను పట్టుకున్నారు అని ఎస్పీ రవీంద్రబాబు చెప్పారు.