జగన్ కు కొత్త పేరు పెట్టిన కొడాలి నాని

Fri Nov 15 2019 16:56:11 GMT+0530 (IST)

Kodali Nani New Name To Jagan

ఏపీలోని 47వేల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి దేశంలోనే ఏ సీఎం సాహసించని రీతిలో జగన్ చేసిన ధైర్యంపై ఇంటా బయటా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికల ముందు వరకూ అందరూ ‘జగనన్నా’ అంటూ జగన్ ను ముద్దుగా పిలిచేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల దశాదిశా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన జగన్ ను ముద్దుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ‘జగన్ మామా’ అంటూ పిలుస్తున్నారట..ఇదే విషయాన్ని తాజాగా మంత్రి కొడాలి నాని ప్రస్తావించి జగన్ కు కొత్త పేరు పెట్టారు. రాష్ట్రంలోని పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం చదువులతో భవిష్యత్తును పంచిన జగనన్న ఇక ‘జగన్ మామ’ అని చెప్పుకొచ్చాడు. ఆ పిల్లలందరికీ జగన్ మేనమామ అయిపోయాడని తెలిపారు. వాళ్లంతా అలానే పిలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

ఇక ఇంగ్లీష్ పై రచ్చ చేస్తున్న టీడీపీ నేతలను కడిగేశాడు కొడాలి నాని.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయన తండ్రి  ఎర్రన్నాయుడు బాగా చదువుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడంతోనే చంద్రబాబు వాళ్లను ఢిల్లీకి ఎంపీలుగా పంపారని.. ఎర్రన్నాయుడి తమ్ముడు అచ్చెన్నాయుడుకు ఇంగ్లీష్ రాకనే విజయవాడలోనే తిరుగుతున్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. విపక్ష నేతల పిల్లలు ఇంగ్లీష్ లో చదువుకుంటే ఏపీలో పేద పిల్లలు తెలుగులో చదవాలా అని టీడీపీ నేతలను కొడాలి నాని నిలదీశారు.