Begin typing your search above and press return to search.

లోకేష్ కి అన్నో , తమ్ముడో ఉంటే ఈపాటికే ... :మంత్రి కొడాలి

By:  Tupaki Desk   |   19 Jun 2021 2:30 PM GMT
లోకేష్ కి అన్నో , తమ్ముడో ఉంటే ఈపాటికే ... :మంత్రి కొడాలి
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు టీడీపీ నేత , మాజీ మంత్రి లోకేశ్ పై మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పప్పు, తుప్పులిద్దరూ ఇంటికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. లోకేశ్ పిచ్చికుక్కలాగా అరుస్తున్నాడని మండిపడ్డారు. తండ్రీ కొడుకులిద్దరూ ఇంట్లో కూర్చొని జూమ్ లో టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. అలాగే ఇప్పటి వరకు ఏ ఒక్కరూ టచ్ చేయని పాయింట్ తీసి లోకేష్ పై సెటైర్లు వేశాడు. లోకేష్ కోటలో ఉన్నా ఒకటే పేటలో ఉన్నా ఒకటే. పేటలో ఉంటే ఏం చేస్తాడో, కోటలో కూడా అదే చేస్తాడు. లోకేష్ చెప్పే మాటలకు, అతడి హావభావాలకు ఏమాత్రం సింక్ ఉండదని , ఓ నియోజకవర్గంలో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి, తన ఫోటో తో 150 మంది ఎమ్మెల్యేల ను అసెంబ్లీ కి నడిపిన సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నాడు. ఎదో తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి లోకేష్ ను ఆ పార్టీ భరిస్తోంది, అలాగే మరొకరు లేరు కాబట్టి చచ్చినట్టు ప్రమోట్ చేస్తున్నారు కానీ, లోకేష్ కి తమ్ముడో, అన్నో, చెల్లెలో ఉంటే ఎప్పుడో లోకేష్ ను ఇంట్లో ఓ మూల కూర్చోబెట్టేవారని , చంద్రబాబుకు పట్టిన ఖర్మ లోకేష్ అంటూ సరికొత్త పాయింట్ తీసుకోని సెటైర్లు విసిరారు.

లోకేష్ పై ఈ తరహా కామెంట్స్ చేసిన తోలి నేత మంత్రి కొడాలి నాని. ప్రతిసారి లోకేష్ జగన్ పై విమర్శలు చేయడం , మంత్రి కొడాలి నాని లోకేష్ పై విమర్శలు చేయడం అనేది సర్వసాధారణం. కానీ, ఇలా కొంచెం కొత్తగా విమర్శించారు కొడాలి నాని. ఇక పదే పదే జగన్ కు దమ్ము లేదంటున్న లోకేష్, జగన్ దమ్ము ఏంటో తెలియాలంటే ఇంటికెళ్లి వాళ్ల నాన్న చంద్రబాబును అడిగితే చెప్తాడని నాని అన్నారు. జగన్ దమ్ముకు చంద్రబాబు ఇంట్లో కూర్చున్నారని, లోకేష్ లూజ్ బ్రెయిన్ కు ఇంకా ఆ విషయం అర్థంకావడం లేదన్నారు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తన కొడుకు వెన్నుపోటు పొడుస్తాడన్న అనుమానంతోనే లోకేశ్ ను ఫాం హౌస్ కు పంపించారని అన్నారు. తండ్రీ కొడుకులను కుక్కల వ్యాన్ ఎక్కించి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. జగన్ ప్రజాబలం, నిగ్రహ శక్తి, మంచితనం ముందు చంద్రబాబు ఏ మూలకు పనికిరారన్నారు కొడాలి నాని.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లించకుండా వదిలేసి వెళ్లిన బకాయిలను తాము చెల్లిస్తున్నామని, 2017, 2018, 2019 సంవత్సరాల్లో రైతులకు రూ.4 వేల కోట్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి బాబు పారిపోతే, తాము చెల్లించామన్నారు. 21 రోజుల్లోపే ధాన్యం డబ్బులు రైతులకు ఇస్తున్నామని వివరించారు. ఇటీవలే రూ.1,637 కోట్లు చెల్లించామన్నారు. ఇంకా రూ.1,619 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఇవన్నీ కనిపించని చంద్రబాబు జగన్ పై బురదజల్లేందుకే పనికిమాలిన లేఖలు రాస్తున్నారని విమర్శించారు. కరోనా వచ్చి చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కుంటే, ఇక్కడ దేవినేని ఉమా లాంటి వాళ్లు ఊకను చూపించి ధాన్యం కొనాలంటూ ధర్నాలు చేస్తున్నారని అన్నారు. బాబు చిటికేసినా జగన్ చిటికెన వేలి గోటిని కూడా తాకలేరని అన్నారు. పిచ్చి మాటలు మాట్లాడితే అబ్బా కొడుకుల తాటతీస్తామని హెచ్చరించారు. ఇద్దరినీ బట్టలూడదూసి రోడ్డు మీద నిలబెడతామని మండిపడ్డారు.