Begin typing your search above and press return to search.

ఆ వీడియో షేర్ చేసిన కిరణ్ బేడీ.. నెటిజన్ల దారుణ ట్రోల్స్

By:  Tupaki Desk   |   12 May 2022 7:12 AM GMT
ఆ వీడియో షేర్ చేసిన కిరణ్ బేడీ.. నెటిజన్ల దారుణ ట్రోల్స్
X
ఆమె దేశంలోనే అగ్రశ్రేణి ప్రముఖ ఐపీఎస్ అధికారి.. పైగా ఒక రాష్ట్రానికి గవర్నర్ కూడా.. కానీ ఇప్పుడు ఆమె చేసిన పనికి ట్విట్టర్‌లో క్రూరంగా ట్రోల్ చేయబడుతోంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత కఠినమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అభిప్రాయానికి అర్హులు.. కానీ ఈ రిటైర్డ్ ఐపిఎస్ అధికారి కిరణ్ బేడీ అభిమానులు ప్రస్తుతం ఆమెపై చాలా కఠినంగా ట్రోల్స్ చేస్తున్నారు.

మాజీ ఐపీఎస్ అధికారిణి, పాండిచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సోషల్ మీడియాలో బుక్ అయ్యారు. పొరపాటున ఓ వీడియోను షేర్ చేసి అభాసుపాలయ్యారు. అందరి ముందు నవ్వుల పాలయ్యారు. ఆమె షేర్ చేసిన వీడియోలో అసలు ఏముందంటే? ఓ షార్క్ చేప నీళ్లలోంచి ఒక్కసారిగా ఎగిరి హెలికాప్టర్ ను నోటితో పట్టుకుంటుంది.. సముద్రంలోకి లాగేస్తుంది. దీంతో అక్కడే పక్కన బోటులో ఉన్న యువతీ యువకులు హతాశులై చూస్తూ ఉండిపోయారు.

ఆ షార్క్ చేప తన నోటితో హెలికాప్టర్ ను పట్టుకోవడంతో ఆ హెలికాప్టర్ క్రాష్ అయ్యి నీటిలో పడిపోతుంది. అయితే ఈ వీడియోపై నేషనల్ జాగ్రఫిక్ చానెల్ కొన్ని మిలియన్ డాలర్లు పెట్టి రైట్స్ కొనుక్కున్నారని వీడియోలో ఉంది.

ఈ వీడియో చూసి కిరణ్ బేడి పప్పులో కాలేశారు. నిజానికి ఈ వీడియో ‘5 హెడెడ్ షార్క్’ అటాక్ అన్న సినిమాలోనిది కావడం విశేషం. ఇవేవీ తెలుసుకోకుండా కిరణ్ బేడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నవ్వుల పాలయ్యారు.

ఈ వీడియోను కిరణ్ బేడీ షేర్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కిరణ్ బేడీ అకౌంట్ హ్యాక్ అయ్యిందని భావిస్తున్నామని కామెంట్ చేశారు. ‘ధన్యవాదాలు మేడమ్.. చాలా మంది సివిల్స్ అభ్యర్థులకు మీరు స్ఫూర్తి మీ తెలివి తేటలను చూస్తుంటే మీకే సివిల్స్ వచ్చినప్పుడు వారికి ఎందుకు రాదు అన్న ధైర్యం వచ్చేస్తుంది ’ అంటూ ట్వీట్ చేశారు.

ఇంత చదువుకున్న ఐపీఎస్ అధికారిణి కూడా చివరకు వాట్సాప్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ బ్యాచ్ లో చేరారని కొందరు ఎద్దేవా చేశారు. ఆమె ఐపీఎస్ అధికారిణి అయ్యిందని, అలాగే ఐకానిక్ మెగసాసీ అవార్డును కూడా ఎలా పొందిందని కొందరు ట్రోల్స్ చేశారు. అయితే ఏది నిజమో అవాస్తవమో.. ట్విట్టర్‌లో ఏది షేర్ చేయాలో ఆమెకు తెలియదని కొందరు వ్యాఖ్యానించారు.