Begin typing your search above and press return to search.

స్క్విడ్‌ గేమ్‌ చూశాడని మరణశిక్ష .. ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   25 Nov 2021 8:31 AM GMT
స్క్విడ్‌ గేమ్‌ చూశాడని మరణశిక్ష .. ఎక్కడంటే ?
X
కిమ్ జంగ్ ఉన్ ఈ పేరు వింటే అమెరికా సైతం గజగజ వనకాల్సిందే. ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన ఈ అధినేత ఆగడాలు గురించి తెలిస్తే, మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థమవుతుంది. కేవలం కిమ్ మాత్రమే కాదు. అతడి కుటుంబం మొత్తం అంతే.

వారికి ఎవరైనా ఎదురైతే సొంతవాళ్లని కూడా చంపేయడం వారి ఆనవాయితీ. అలాంటి ఆ ప్రభుత్వంలోని అధికారులు, ఆ దేశంలో నివసించే ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆ దేశంలో ఇప్పటికీ సుమారు 100 ఏళ్లు వెనకబడే ఉందంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంటర్నెట్ ఉండదు.

కేవలం మూడే టీవీ చానెళ్లు మాత్రమే ఉంటాయి. ఫోన్లు ఉపయోగించకూడదు. అక్కడి పేదలకు ఫొటోలు తీయకూడదు. ఇలా ఒకటేమిటీ ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి.

ఇక తాజాగా నెట్‌ ఫ్లిక్స్‌ సిరీస్‌ స్క్విడ్‌ గేమ్‌ ను చూశాడనే నెపంతో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించాడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఆ వెంటనే శిక్షను అమలు చేస్తూ ఆ వ్యక్తిని కిరాతకంగా కాల్చి చంపింది సైన్యం.

చైనా సర్వర్ల నుంచి సిరీస్‌ ను డౌన్‌ లోడ్‌ చేసి వీక్షించాడని, అంతటితో ఆగకుండా ఫ్లాష్‌ పెన్‌ డ్రైవ్‌ లలో కొందరు విద్యార్థులకు కాపీలను అమ్ముకున్నాడని ప్రభుత్వం ఆరోపించింది. ఇక ఈ వ్యవహారంలో ఓ విద్యార్థికి జీవిత ఖైదు విధించారు.

సిరీస్‌ చూసిన మరో ఆరుగురికి, సదరు స్కూల్‌ ప్రిన్స్‌పాల్‌, టీచర్లను విధుల నుంచి తొలగించి ఐదేళ్ల నిర్భంద శిక్ష విధించాడు కిమ్‌. నార్త్‌ కొరియా చట్టాల ప్రకారం వీళ్లంతా బొగ్గు గనుల్లో, మారుమూల పల్లెల్లో శిక్షాకాలం పాటు కూలీ పనులు చేయాల్సి ఉంటుంది.

స్క్విడ్‌ గేమ్‌ అనేది వినోదం పంచేది కాదు. పెట్టుబడిదారి అయిన దక్షిణ కొరియా క్రూరత్వాన్ని ప్రతిబింబించే షో. డబ్బు కోసం మనిషి ఉవ్విళ్లూరడం, ప్రాణాల్ని పణంగా పెట్టడం.. ఉత్తర కొరియా సంప్రదాయానికి విరుద్ధమైన అంశాలు.

అందుకే మొగ్గలోనే ఈ వ్యవహారాన్ని తుంచేస్తున్నాం అంటూ ప్రభుత్వం తరపు నుంచి ఓ స్టేట్‌ మెంట్‌ స్థానికంగా ఓ పత్రికలోనూ ప్రచురితమైంది. ఉత్తర కొరియాలో క్యాపిటలిస్ట్‌ దేశాల ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కార్యక్రమాల్ని వీక్షించినా, వాటి కాపీలు కలిగి ఉన్నా, ఇతరులకు పంపిణీ చేసినా నార్త్‌ కొరియాలో కఠిన శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ లిస్ట్‌ లో అమెరికా, దక్షిణ కొరియాను ప్రముఖంగా చేర్చింది కిమ్‌ ప్రభుత్వం.