Begin typing your search above and press return to search.

తోకజాడిస్తే తాటతీస్తా.. దక్షిణ కొరియాకు కిమ్​ వార్నింగ్​

By:  Tupaki Desk   |   28 Sep 2020 12:30 AM GMT
తోకజాడిస్తే తాటతీస్తా.. దక్షిణ కొరియాకు కిమ్​ వార్నింగ్​
X
నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలు - చేష్టలతో వార్తల్లో నిలిచే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జంగ్ ఉన్​.. మరోసారి రెచ్చిపోయాడు. అయితే ఈసారి నోరు పారేసుకుంది అమెరికాపై కాదు..దక్షిణకొరియాకు..ఆ దేశానికి తనదైన స్టైల్ ​లో వార్నింగ్​ ఇచ్చాడు. మరోసారి దక్షిణకొరియా వాళ్లు తమ దేశం దరిదాపుల్లోకి వచ్చినా కాల్చిపారేస్తానని ప్రకటించాడు. దీంతో ప్రస్తుతం కిమ్​ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవలే దక్షిణకొరియాకు చెందిన ఓ అధికారిని ఉత్తరకొరియా సైన్యం కాల్చిచంపడంపై తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై ప్రజాసంఘాలు - రాజకీయపార్టీలు స్పందించాయి. ఉత్తరకొరియా వైఖరిని తప్పుపట్టాయి. ఒక అధికారి సరిహద్దుల దిశగా వెళుతున్నాడని తెలిసి కూడా సైన్యం అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ​ఈ ఘటనపై క్షమాపణ చెప్పాడు. కిమ్​ సారీ చెప్పడం ఇదే తొలిసారి. అయితే తాజాగా కిమ్ దక్షిణ కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు. ‘సారీ చెప్పాను సాఫ్ట్‌ గా ఉంటానని అనుకుంటున్నారేమో... తేడా వస్తే తాట తీస్తా’ అంటూ దక్షిణకొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు. తమ సరిహద్దులోకి ఎవరైనా వస్తే పరిస్థితి ఊహించనంతగా ఉంటుందని గట్టి సంకేతాలు పంపాడు. తమ సరిహద్దుల్లో ఎవరన్నా కనిపిస్తే మేము తీసుకొనే చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. అంటూ హెచ్చరికలు జారీ చేశారు కిమ్​. మరోవైపు దక్షిణ కొరియా అధికారి మృతదేహం దొరికితే తప్పకుండా అప్పగిస్తామని ఉత్తరకొరియా స్పష్టం చేసింది. రెండు దేశాలమధ్య ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొని ఉంది. కిమ్ వైఖరితో పొరుగు దేశాలు కూడా ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా తయారవుతున్నాయి.