నా బాయ్ ఫ్రెండ్ ను చంపేయ్.. సుపారీగా డబ్బు.. సెక్స్ చేస్తా

Sun Feb 28 2021 10:06:59 GMT+0530 (IST)

Kill my boyfriend

రోజులు గడుస్తున్న కొద్దీ బయటకు వస్తున్న నేరాలు.. ఘెరాలు నోట మాట రాకుండా చేస్తున్నాయి. మరీ.. ఇంత దారుణమా? అన్నట్లుగా ఉంటున్న దారుణాలు విన్నంతనే ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి దారుణ నేరం ఒకటి మహారాష్ట్రలో బయటకు వచ్చింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో చందు మహాపూర్ అనే వ్యక్తికి గతంలోనే పెళ్లైంది. అయితే.. అతడు 20 ఏళ్ల యువతితో రిలేషన్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సదరు యువతి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా చందును కోరింది. అందుకు అతడు నో చెప్పాడు. తనను వాడుకుంటూ తనను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోని చందుపై రివేంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు దారుణమైన మాస్టర్ ప్లాన్ వేసింది.

అతడ్ని చంపేందుకు భరత్ గుర్జర్ అనే కాంట్రాక్ట్ కిల్లర్ తో డీల్ కుదుర్చుకుంది. తన బాయ్ ఫ్రెండ్ ను చంపేయాలని కోరింది. అందుకు ప్రతిగా రూ.1.5లక్షలతో  పాటు.. సెక్సు చేస్తానని ఒప్పందం చేసుకుంది. దీంతో.. కాంట్రాక్ట్ కిల్లర్ ఓకే చెప్పేసి.. చందును దారుణంగా చంపేశాడు. ముందుగా చందు తల పగులగొట్టి.. అనంతరం అతడి డెడ్ బాడీని క్రషర్ గనిలో పడేశాడు. అతడి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా భరత్ ను గుర్తించాడు.

చందును చంపేసినంతనే డబ్బుతో పాటు సెక్సు చేస్తానన్న కాంట్రాక్టు పూర్తి కాక ముందే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా.. మొత్తం వివరాల్ని వెల్లడించాడు. దీంతో హత్యకు ప్లాన్ చేసిన అమ్మాయిని.. ఆమె తల్లిదండ్రుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అంతా జైల్లో ఊచలు లెక్క పెడుతున్నట్లుగా తెలుస్తోంది.