Begin typing your search above and press return to search.

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంపై కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   14 Sep 2021 4:26 PM GMT
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంపై కీలక నిర్ణయం
X
తెలంగాణలోనే అతి పెద్దది.. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం. అయితే ప్రతీసారి ట్యాంక్ బండ్ చెరువులో ఈ వినాయకుడి నిమజ్జనం సాగుతుంది. కానీ ఈసారి హైకోర్టు ట్యాంక్ బండ్ లో నిమజ్జనంకు వీల్లేదని నిషేధించింది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహంపై గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

2022 నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించింది. అలాగే మట్టి విగ్రహమే పెడుతామని ప్రకటించింది. గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ప్యాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం కీలకంగా మారింది.

హుస్సేన్ సాగర్ లోనే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రతీసారి జరిగేది. కానీ ఈ సారి హైకోర్టు నిర్ణయంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్ కాలుష్య కారకంగా మారిందని.. అందులో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఈ ఒక్క ఏడాది అనుమతి ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు. దీంతో ఖైరతాబాద్ గణేష్ పై ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.