Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్: దేశద్రోహ చట్టంపై లా కమిషన్‌ కీలక నివేదిక!

By:  Tupaki Desk   |   2 Jun 2023 2:19 PM GMT
హాట్ టాపిక్: దేశద్రోహ చట్టంపై లా కమిషన్‌ కీలక నివేదిక!
X
ఏ వ్యక్తి అయినా మాటల ద్వారా, రాయడం ద్వారా, చేతల ద్వారా లేదా సంకేతాల ద్వారా ద్వేష పూరితంగా దిక్కారాన్ని, ప్రభుత్వం పై వ్యతిరేకత ను తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు.. ఆ దిశగా ఇతరుల ను ప్రేరేపించినప్పుడు దాన్ని దేశద్రోహంగా పరిగణిస్తారు! సెక్షన్ 124A కింద ఈ నేరానికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.. జరిమానా కూడా ఉండొచ్చు. ఇది దేశద్రోహం / రాజద్రోహ చట్టం గురించిన సంక్షిప్త వివరణ! ఇప్పుడు దీనికి సంబందించిన అప్ డేట్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది!

దేశద్రోహ చట్టాన్ని (ఐపీసీ సెక్షన్ 124A) తొలగించాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. బ్రిటిషర్ల హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని ఇప్పటి వరకు కొనసాగించాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో బ్రిటిష్ కాలం నాటి ఈ రాజద్రోహ చట్టం పై గతేడాది సుప్రీంకోర్టు స్టే విధించింది. పునఃసమీక్ష పూర్తయ్యేదాకా ఈ చట్టం కింద కొత్తగా కేసులు ఏవీ నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు సుప్రీం సూచించింది. దీని పై రివ్యూ చేసి ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.

ఈ నేపథ్యంలో దేశద్రోహ చట్టానికి సంబంధించి లా కమిషన్ కీలక సిఫార్సులు చేసింది. భారతీయ శిక్షాస్మృతి లోని 124ఆ సెక్షన్‌ ను పునరుద్ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే కొన్ని సవరణల ద్వారా ఈ సెక్షన్‌ పై మరింత స్పష్టతనివ్వాల్సి ఉందని అభిప్రాయపడింది. విశ్రాంత కర్ణాటక హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి నేతృత్వం లోని లా కమిషన్ ఈ మేర కు సిఫార సు చేసింది.

ఈ సందర్భంగా లా కమిషన్ కొన్ని కీలక సూచనలు చేసింది. కొన్నిసార్లు దుర్వినియోగం జరిగిందనే కారణంతో.. మొత్తం ఈ చట్టాన్ని రద్దు చేయాల ని అనుకోవడం తగదని.. దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుని 124ఆని కొనసాగించడమే ఉత్తమం అని లా కమిషన్‌ కమిటీ స్పష్టం చేసింది. అయితే... అవసరాన్ని బట్టి సి.ఆర్.పి.సి. లోని సెక్షన్‌ 154కు 1973 నాటి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సెక్షన్‌ 196(3) నిబంధనను చేర్చాలని.. దీనివల్ల సెక్షన్‌ 124A కింద ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసే సమయం లో జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.

ఇదే సమయంలో 124A అనేది లేకపోతే... ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింస ను ప్రేరేపించే కేసుల్లో మరింత కఠినమైన తీవ్రవాద చట్టాల ను ప్రయోగించాల్సి వస్తుందని ఈ కమిషన్ గుర్తుచేసింది! దీంతో... మరోసారి దేశద్రోహ చట్టం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.