Begin typing your search above and press return to search.

విడాకుల కోసం 'వెయిట్' చేయాల్సిన పనిలేదు : కేరళ హైకోర్టు..!

By:  Tupaki Desk   |   10 Dec 2022 4:45 AM GMT
విడాకుల కోసం  వెయిట్ చేయాల్సిన పనిలేదు : కేరళ హైకోర్టు..!
X
పాశ్చాత్య దేశాల్లో పెళ్లి.. విడాకులు అనేది చాలా కామన్ అయిపోయింది. ఆయా దేశాల్లో సహజీవనం.. రెండు.. మూడు పెళ్లిళ్లు.. మళ్లీ మళ్లీ విడాకులు అనేవి తరుచూ చూస్తూనే ఉంటాం. ఇక ఈ సంస్కృతి భారత్ లోనూ క్రమంగా విస్తరిస్తోంది. పాశ్చత్య కల్చర్ మాయలో పడుతున్న మనోళ్లు సైతం పెళ్లి వ్యవస్థను బీటలు వారుస్తున్నారు.

ఈ క్రమంలోనే భారత్ లోనూ ఇటీవలి కాలంలో విడాకులు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒకరి స్వేచ్ఛను మరొకరు కట్టడి చేయకూడదనే భావనతో కోర్టులు సైతం విడాకుల విషయంలోనూ సానుకూలత చూపిస్తున్నాయి. మహిళలు సైతం సొంతం నిర్ణయాలు తీసుకునే స్థాయికి.. ఒకరిపై ఆధారపడి జీవించే స్థాయికి ఎదిగారు. మగవాళ్లకు తామేమీ తీసిపోమనే భావన వారిలో ఇటీవలి కాలంలో బలంగా నాటుకుపోతుంది.

ఇంటి పనులు.. పిల్లల బాధ్యతను తామొక్కరే ఎందుకు మోయలనే భావనలో భార్యలోనూ.. తానెక్కొడినే సంపాదించాలా? అనే భావన భర్తలోనూ కన్పిస్తోంది. దీనికి తోడు వ్యక్తిగత స్వేచ్ఛ ఇరువురిలోనూ పెరగడంతో ఇది కాస్తా అక్రమ సంబంధాలకు సైతం దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో పెళ్లి బంధం క్రమంగా బీటలు వారుతోంది.

ఇక విడిపోవాలని జంటలు ఫిక్సయిన తర్వాత విడాకులు ప్రాసెస్ అనేది చాలా జఠిలంగా మారుతోంది. పలుసార్లు కౌన్సిలింగ్.. వాయిదాల పేరుతో జంటలను లాయర్లు.. కోర్టులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. విడిపోయే జంట ఆర్నెళ్లు కలిసి ఉండాలనో.. లేదంటే సంవత్సరం పాటు విడిగా ఉండాలనో నిబంధనలు సైతం ఆ జంటలకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.

హిందూ వివాహ చట్టం.. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భార్యభర్తలు విడాకుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే క్రైస్తవ వివాహ చట్టంలో దీనికి తావు లేకుండా పోయింది. కైస్త్రవ చట్టం 1869 నిబంధనల ప్రకారం విడాకులు తీసుకునే జంట కనీసం ఏడాది పాటు విడిగా ఉండాలి. గతంలో ఈ వ్యవధి రెండేళ్లు ఉండేది. అయితే విడాకుల కోసం ఏడాది విడిగా ఉంటే సరిపోతుందని 2010లో నిబంధనలను కేరళ హైకోర్టు సవరించింది.

తాజాగా అదే నిబంధనను అదే కోర్టు కొట్టివేసింది. విడాకులు కోరే దంపతులు ఖచ్చితంగా విడిగా ఉండాలన్న నిబంధనేమీ లేదని.. ఇది విడాకులను నియంత్రించే విధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. అందుకే ఏడాది పాటు విడిగా ఉండాలన్న నిబంధనను కొట్టి వేస్తున్నట్లు కేరళ హైకోర్టు విడాకులపై కీలక తీర్పును వెలువరించింది. దీంతో క్రైస్తవులు సైతం ఎప్పుడంటే అప్పుడు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కే ఛాన్స్ దక్కింది. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద మాతో పంచుకోండి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.