Begin typing your search above and press return to search.

'నెగిటివ్' సర్టిఫికేట్‌‌ ఉంటేనే శబరిమల యాత్ర !

By:  Tupaki Desk   |   11 Aug 2020 5:30 PM GMT
నెగిటివ్ సర్టిఫికేట్‌‌ ఉంటేనే శబరిమల యాత్ర !
X
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి శబరిమల యాత్ర ఉంటుందా..? ఉండదా..? అన్న ప్రశ్నలకు కేరళ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలను కరోనా నిబంధనలను అనుసరించి నిర్వహిస్తామని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తాజాగా వెల్లడించారు. నవంబర్‌ 16 నుంచి శబరిమల దర్శనానికి భక్తులను అనుమతించబోతున్నట్లు తెలిపారు.

ఇక , కరోనా మహమ్మారి నిబంధనలకు అనుగుణంగా ఈ ఏడాది శబరిమల యాత్ర ఉంటుందని తెలిపారు. మాల ధరించి అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నెగిటివ్‌ సర్టిఫికేట్‌లు తీసుకురావాలని సూచించారు. అది కూడా ఐసీఎంఆర్‌ గుర్తింపు ఉన్న ల్యాబుల్లోనే కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల కోసం సన్నిధానం, పంబ, నీలక్కల్‌ ప్రాంతాల్లో వైద్య సేవలను అందుబాటులో ఉంచామని, దర్శనానికి వచ్చే భక్తులందరికీ ముందుగానే స్క్రీనింగ్ చేసి, మాస్కులు, శానిటైజర్లు అందిస్తామని అన్నారు. ఇక కొండకు వచ్చే భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. ఇక పంబా, నిలక్కల్‌ మధ్య కేరళ బస్సులను నడుపుతామని , ఆ బస్సులో కూడా భౌతిక దూరం పాటించేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక , ఎమర్జెన్సీ నేపథ్యంలో హెలికాఫ్టర్ సర్వీసులు నడపడం మేలని ఈ సందర్భంగా పతనంతిట్ట కలెక్టర్‌ ప్రభుత్వాన్ని కోరారు.