Begin typing your search above and press return to search.

ల‌వ్‌ జిహాద్‌ లో కొత్త కోణం..కేర‌ళ స‌ర్కారు ఏం చెప్తుంది?

By:  Tupaki Desk   |   17 Jan 2020 5:24 PM GMT
ల‌వ్‌ జిహాద్‌ లో కొత్త కోణం..కేర‌ళ స‌ర్కారు ఏం చెప్తుంది?
X
లౌకిక‌త్వానికి తాము బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ప్ర‌క‌టించుకునే వామ‌ప‌క్ష పార్టీల‌కు సంక‌ట ప‌రిస్థితి. మైనార్టీల ప‌క్ష‌పాతిగా ఉండే వామ‌ప‌క్షాలు ఇప్పుడు వారి కోసం స్పందించాల్సిన ప‌రిస్థితి. వామ‌ప‌క్ష పార్టీ అధికారంలో ఉన్న కేరళలో లవ్‌ జిహాద్ క‌ల‌క‌లం రేగింది. లౌకికత్వానికి - సామాజిక ప్రశాంతతకు విఘాతం కలిగించే స్థాయిలో ల‌వ్ జిహాద్ జరుగుతోంద‌ని... గ‌త కొద్దికాలంగా ఈ పోక‌డ పెరుగుతోందని కేథలిక్‌ బిష్‌పల వేదిక ‘సైరో మలబార్‌ కేథలిక్‌’ చర్చ్‌ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఇటు ముస్లింలు అటు క్రైస్త‌వుల‌కు సంబంధించిన వివాదంలో కేర‌ళ స‌ర్కారు - వామ‌ప‌క్ష పార్టీ స్పంద‌న ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

కేరళలో ఓ క్రైస్తవ యువతి సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌తో మ‌ళ్లీ ల‌వ్ జిహాద్ అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. తాను ప్రేమించిన ఓ యువకుడు ఇస్లాం మతం స్వీకరించాల్సిందిగా బలవంతం చేస్తున్నాడని - తనను లైంగిక వేధింపులకు గురిచేసి బ్లాక్ మెయిల్‌ కూడా చేస్తున్నాడని ఆ యువతి ఆవేదన చెందింది. దీంతో కేథలిక్‌ బిషప్ ల వేదిక ‘సైరో మలబార్‌ కేథలిక్‌’ చర్చ్ స్పందించింది. నేపథ్యంలో.. దీనిపై సైరో మలబార్‌ చర్చ్‌ మత సభ మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించి - అనంతరం ఓ ప్రకటనను విడుదల చేసింది. క్రైస్తవ యువతులను లక్ష్యంగా చేసుకుని ఐఎస్‌ ఉచ్చులోకి లాగుతున్నారని - కొన్ని సందర్భాల్లో వారిని చంపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలికాలంలో ఉగ్ర‌వాద సంస్థ అయిన ఐఎస్ఐఎస్‌లో చేరిన 21 మంది మహిళల్లో సగానికిపైగా క్రైస్తవ యువతులేనని.. క్రైస్తవులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని పేర్కొంది.

యువతుల్ని బ్లాక్ మెయిల్ చేసి మతం మార్చిన కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ఒక పథకం ప్రకారమే లవ్ జిహాద్ జరుగుతోందన్న ఆరోపణలు వ్య‌క్త‌మ‌య్యాయి. కాగా, 2005- 2012 మధ్య కాలంలో దేశంలో ఒక్క కేరళలోనే నాలుగు వేల దాకా లవ్ జిహాద్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే చర్చి పలు చోట్ల క్రైస్తవ అమ్మాయిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జీహాదీల ట్రాప్‌లో పడకూడదంటూ హిత బోధ చేస్తోంది. కాగా, దీనిపై హిందూ సంస్థ విశ్వ‌హిందూ ప‌రిష‌త్ స్పందిస్తూ గ‌తంలో హిందూ యువ‌తుల‌ను ప్రేమ పెళ్లిల్లు-మ‌త మార్పిడులు చేసిన ఓ మ‌త‌స్తులు ఇప్పుడు క్రైస్త‌వుల‌ను ఎంచుకున్నార‌ని తాజా ఘ‌ట‌న‌లు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని పేర్కొంది.