Begin typing your search above and press return to search.

కేరళ సంచలన నిర్ణయం: మాస్క్ లేకుంటే రూ.10 వేల జరిమానా

By:  Tupaki Desk   |   5 July 2020 4:18 PM GMT
కేరళ సంచలన నిర్ణయం: మాస్క్ లేకుంటే రూ.10 వేల జరిమానా
X
వైరస్ విజృంభణ భారత్ లో తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లోనే ఉంది. ప్రస్తుతం వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలో మొదట్లో కేసులు భారీగా నమోదయ్యాయి. అప్పుడు అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టింది. పకడ్బందీగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడంతో ఆ రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉంది. మరికొంత అదుపులో చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్క్ తప్పనిసరి చేస్తూనే మాస్క్ లేనివారికి భొరీ జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వైరస్ ను కట్టడి చేయగలిగింది. ఇప్పుడు పూర్తిగా వైరస్ నిర్మూలనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలుచేయాలని నిర్ణయించింది. అంటువ్యాధుల చట్టం కింద పలు నిబంధనలతో కూడిన ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఆ నిబంధనల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా రూ.10 వేల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది.

ఈ ఆర్డినెన్స్ లో ఉన్న నిర్ణయాలు

- పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
- పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆరడుగుల దూరం పాటించాలి.
- దుకాణాలు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశాల్లో 25 మందికి మించి ఉండకూడదు.
- వివాహ కార్యక్రమాల్లో 50, అంత్యక్రియల్లో 20 మందికి మించకూడదు.
- ధర్నాలు ర్యాలీలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి..10 మందికి మించకూడదు.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదు.
- కేరళకు వచ్చేవారు ముందుగానే ‘రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ జాగ్రత్తలో రిజిస్టర్ చేసుకోవాలి.

ఈ రూల్స్ ను ఏడాదిపాటు అమలుచేస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నారు.