Begin typing your search above and press return to search.

ఆ బిషప్ నిర్ధోషి.. దేశాన్ని షేక్ చేసిన రేప్ కేసులో తీర్పు

By:  Tupaki Desk   |   14 Jan 2022 1:13 PM GMT
ఆ బిషప్ నిర్ధోషి.. దేశాన్ని షేక్ చేసిన రేప్ కేసులో తీర్పు
X
దేశాన్ని షేక్ చేసిన కేరళ బిషప్ చేసిన అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఓ నన్ పై బిషప్ అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదైన కేసులో తీర్పు వచ్చింది. బిషప్ ను కొట్టాయం కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. దేశంలోనే తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. బిషప్ ను నిర్ధోషిగా ప్రకటించింది.

2018లో కేరళకు చెందిన ఓ 45 ఏళ్ల నన్ లైంగిక ఆరోపణలు చేశారు. జలంధర్ లోని రోమన్ క్యాథలిక్ చర్చ్ లో బిషప్ గా ఉన్న ఫ్రాంకో ములక్కల్ పై నన్ ఈ ఆరోపణలు చేసింది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

2014లో బిషప్ ఫ్రాంకో ములక్కల్ కురివిలంగద్ లోని నన్ పనిచేసే కాన్వెంట్ కు వచ్చాడు. రాత్రివేళ బిషప్ పిలవగా నన్ వెళ్లింది. గదిలో అత్యాచారం చేశాడట.. 2014-16 మధ్యకాలంలో అనేక సార్లు నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడండి.. 2018లో బిషప్ నన్ను, నా కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే ఈ రేప్ కేసులో అరెస్ట్ అయిన భారతదేశంలోనే తొలి క్యాథలిక్ చర్చి బిషప్ ఫ్రాంకో ములక్కల్ కావడంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆందోళనకారులు బిషప్ పై చర్యలు తీసుకోవాలని ర్యాలీలు తీశారు. దేశవ్యాప్తంగా కేసు సంచలనమైంది. కేరళ ప్రభుత్వం సిట్ కూడా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కొట్టాయం కోర్టు బిషప్ అత్యాచారం జరిగిందని ఆరోపించిన తేదీల్లో అసలు కురివిలంగద్ లోని కాన్వెంట్ లో బస చేయలేని రుజువైంది. దీంతో అతడిని నిర్ధోషిగా ప్రకటించి విడుదల చేసింది.