Begin typing your search above and press return to search.

ఆ మందులు స్టాక్ పెట్టుకోండి : డీసీఏ

By:  Tupaki Desk   |   16 July 2020 9:15 AM GMT
ఆ మందులు స్టాక్ పెట్టుకోండి :  డీసీఏ
X
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది. కరోనా దెబ్బకి తెలంగాణ రాష్ట్రం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హోల్‌ సేల్‌, రిటైల్‌ మెడికల్ షాపులకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌(డీసీఏ) పలు కీలక సూచనలు చేసింది. కరోనా వైరస్‌ పై పోరు కొనసాగించేందుకు ఉపయోగపడే మందులను నిల్వ చేసుకోవాలని మెడికల్ షాపులకు డీసీఏ స్పష్టం చేసింది.

హోం ఐసోలేషన్‌ లో ఉన్న వారు మెడికల్ షాపుల మీదే ఆధారపడతారని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీటి స్టాక్ ‌ను పెట్టుకోవాలని డీసీఏ సూచించింది. డీసీఏ సూచించిన జాబితాలో‌ అజిత్రోమైసిన్, డొక్సిసిలిన్, అమోక్సిసిల్లిన్‌ విత్‌ క్లావులానిక్‌ యాసిడ్, సిఫిక్సిమ్, సిఫొటాక్సిమ్‌, సిట్రిజన్‌ లేదా ఫెక్సొఫెనాడిన్‌, పారాసిటమల్,‌ డెక్సామెథజోన్‌ లేదా మిథైల్‌ ప్రిడ్సిసొలోన్‌, జింక్, విటమిన్‌ సి, విటమిన్‌ డి, బెనడ్రైల్‌ లేదా ఆంబ్రాక్సిల్,‌ హైడ్రాక్సీక్లోరోక్విన్,‌ ఓసెల్టాంవీర్‌లు ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీటిని నిల్వ చేసుకోవాలని తెలిపింది.