Begin typing your search above and press return to search.

వైరల్: మున్సిపోల్స్ పై కవిత భావోద్వేగ ట్వీట్

By:  Tupaki Desk   |   25 Jan 2020 10:27 AM GMT
వైరల్: మున్సిపోల్స్ పై కవిత భావోద్వేగ ట్వీట్
X
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 120 మున్సిపల్ స్థానాలకు టీఆర్ఎస్ 109 కైవసం చేసుకొని దమ్ము దులిపింది. ఈ విజయం తో గులాబీ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం చూసి మాజీ ఎంపీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ లో కేటీఆర్ ఆర్టిస్టిక్ ఫొటోను షేర్ చేసి భావోద్వేగానికి గురయ్యారు.

మాజీ ఎంపీ కవిత ట్వీట్ చేస్తూ ‘మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాన్ని టీఆర్ఎస్ కు అందించిన తెలంగాణ ప్రజలకు బిగ్ థ్యాంక్యూ. పోటీలో గెలిచిన ప్రతీ ఒక్క అభ్యర్థికి నా శుభాకాంక్షలు. పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులకు కూడా తన బెస్ట్ విషెస్ ’ అంటూ కేసీఆర్ చిత్రపటాన్ని షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు.

ఇక మంత్రి హరీష్ రావు కూడా టీఆర్ఎస్ గెలుపు పై స్పందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు కూడా ‘సీఎం కేసీఆర్, కేటీఆర్ కు అభినందనలు తెలిపారు.’ ప్రత్యర్థులు అందుకోలేని స్థాయి లో టీఆర్ఎస్ కు తిరుగులేని విజయాలు అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ సారథ్యంలోనే టీఆర్ఎస్ కు ఈ విజయం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.