Begin typing your search above and press return to search.

అత్యాచారం తీవ్రమైన నేరమే ..కానీ, ఇది సరైన పద్దతి కాదు !

By:  Tupaki Desk   |   6 Dec 2019 8:18 AM GMT
అత్యాచారం తీవ్రమైన నేరమే ..కానీ, ఇది సరైన పద్దతి కాదు !
X
వెటర్నరీ డాక్టర్ దిశా అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం పట్ల దేశం మొత్తం హర్షిస్తోంది. తెలంగాణ పోలీసులకు జై కొడుతూ.. ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. పలు పార్టీల నేతలు సైతం పోలీసుల చర్యను స్వాగతిస్తున్నారు. ఇలాంటివి జరిగితేనే దేశంలో మహిళల పట్ల అఘయిత్యాలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

కానీ కొంతమంది మాత్రం తెలంగాణ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. దిశ కేసులో హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేసిన అరీఫ్, శివ, నవీన్, చెన్నకేశువులను శుక్రవారం వేకువజామున హైదరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెల్సిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఎన్ కౌంటర్ పై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ... అత్యాచారం తీవ్రమైన నేరమే. చట్టపరంగానే నిందితులకు కఠిన శిక్ష పడాలి. ఎన్‌కౌంటర్ వంటి శిక్షలు సమాజానికి చేటు చేస్తాయి. తక్షణ న్యాయం కోసం బాధితులు ఎదురు చూస్తుంటారని తెలుసు. కానీ, దానికి ఇది పద్ధతి కాదు' అని చెప్పుకొచ్చారు.