బిగ్ షాట్ కోడలితో ఎంజాయ్ కోసం భారీ గోల్డ్ స్కాం

Sat Oct 17 2020 15:40:54 GMT+0530 (IST)

Huge Gold Scam for Enjoy with Big Shot

కర్ణాటకలో వెలుగుచూసిన భారీ గోల్డ్ స్కాంలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అధిక వడ్డీ ఇస్తామని నమ్మించి ప్రజలకు మాయమాటలు చెప్పి కోట్ల రూపాయల విలువైన బంగారం సేకరించి అందరికీ పంగనామాలు పెట్టిన ఈ భారీ గోల్డ్ స్కాం కేసులో ఏ1 ఏ2 నిందితులను పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు భార్య ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు కీలక సూత్రధారులుగా తేల్చారు.కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య పట్టణంలో ఈ భారీ గోల్డ్ స్కాం జరిగింది. బంగారు నగలు తాకట్టు పెట్టిన వాళ్లకు 20శాతం నుంచి 40శాతం వడ్డీ ఇస్తామని పలువురు మహిళలకు మాయమాటలు చెప్పి కొన్ని వందలమంది నుంచి సుమారు రూ.కోట్లలో బంగారు నగలను లూటీ చేశారు.

దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు ఈ కేసులో మాండ్యకు చెందిన ప్రముఖ వ్యాపారావేత్త బిగ్ షాట్ కోడలికి.. ఈ స్కామ్ లో లింక్ ఉందని తేలడంతో పోలీసులు షాక్ అయ్యారు.

మాండ్యలో వెలుగుచూసిన భారీ గోల్డ్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడి  పోలీసుల విచారణలో తేలింది. ఇతడు మహిళల దగ్గర 4.5 కేజీల బంగారు నగలు తీసుకొని వారికి అధిక వడ్డీ ఆశ చూపి కుచ్చుటోపీ పెట్టాడని పోలీసుల విచారణలో తేలింది.

అయితే నిందితుడు మాండ్యాలోని ప్రముఖ వ్యాపారవేత్త బిగ్ షాక్ అయిన ఓ వ్యక్తి కోడలుతో ఎంజాయ్ చేయడానికే ఈ గోల్డ్ స్కామ్ చేశాడని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. నిందితుడు కు బిగ్ షాట్ కొడుకు క్లోజ్ ఫ్రెండ్. అతడి భార్యపేనే కన్నేసి ఈ దందా నిర్వహించాడని తేలింది.

బిగ్ షాట్ కోడలు ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న నిందితుడు .. ఆమెతో ఫైవ్ స్టార్ హోటల్స్ రిసార్టుల్లో ఎంజాయ్ చేయడానికి ఈ డబ్బంతా ఖర్చు చేశాడని పోలీసుల విచారణలో తేలింది. శని ఆది సోమవారాల్లో నిందితుడు బిగ్ షాట్ కోడలు కలిసి ఫైవ్ స్టార్ హోటల్స్ లో తనివితీరా ఎంజాయ్ చేస్తారని.. ప్రతీవారం ఇదే చేస్తారని పోలీసుల విచారణలో తేలింది. భర్తకు అనుమానం రాకుండా మస్కా కొడుతూ బిగ్ షాట్ కోడలు ఈ అక్రమ సంబంధం పెట్టుకుందని.. నిందితుడు తో ఎంజాయ్ చేసిందని తేలింది.

మహిళల బంగారాన్ని సొమ్ముగా మార్చి నిందితుడు ఫ్రెండ్ భార్యతో ఎంజాయ్ చేయడానికి ఖర్చు చేశాడని.. ఈ గోల్డ్ స్కాంలో ఏ1గా నిందితుడు ఏ2గా బిగ్ షాట్ కోడలును నిందితులుగా పోలీసులు చేర్చారు. ఈ మొత్తం వ్యవహారం వెలుగుచూడడంతో కర్ణాటక వ్యాప్తంగా సంచలనమైంది.