పురుషాంగం పండుగ.. జపనీయుల కోలాహలం

Mon Sep 16 2019 22:29:41 GMT+0530 (IST)

Kanamara P nis Festival Exposed ONLY in JAPAN

ఈ ప్రపంచంలో వింతలు విశేషాలు చాలానే ఉంటాయి.  అయితే అన్నీ మనకు తెలిసి ఉంటాయి అనుకోలేం. జపాన్ దేశం లో జరిగే కనమర మాట్సూరి పండగ అలాంటిదే.  కనమర మాట్సూరి అనగానే అదేదో సాఫ్ట్ పదమేనని అనుకుంటాం.  అయితే దీన్ని ఇంగ్లీష్ లో పెనిస్ ఫెస్టివల్(పురుషాంగం పండుగ తెలుగులోకి అనువాదం చేసుకోవాలి) అంటారు.ఈ పండుగ జపాన్ లోని కవసాకి అనే ప్రదేశంలో ఉన్న కనయమ టెంపుల్ లో జరుగుతుంది. ఈ పండుగను ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో మొదటి ఆదివారం నాడు జరుపుకుంటారు జపనీయులు.  ఇది జరుపుకోవడం వెనుక ఒక కథ ఉంది.  కథ కొంచెం బోల్డ్ కాబట్టి జపనీయుల మనోభావాలు అర్థం చేసుకోకుండా మీ మనోభావాలు దెబ్బ తింటాయి అనుకుంటే కళ్ళు మూసుకోండి!

కథలోకి సిగ్గుఎగ్గు లేకుండా వెళ్తే..  ఫుల్ గా అసూయ ఉండే పదునైన పళ్ళున్న ఒక రాక్షసి ఓ అమ్మాయి యోనితో ప్రేమలో పడిందట.  దాంతో వెళ్ళి అదే యోనిలో పడింది.. అంటే అక్కడ దాక్కుందట.  ఇక ఆ అమ్మాయికి వివాహం అయిన తర్వాత ఫస్ట్ నైట్ కు భర్త ఊపుకుంటూ వస్తే.. వాడి పురుషాంగాన్ని ఆ రాక్షసి తన పదునైన పళ్ళతో కొరికి అవతల పారేసిందట.  ఇదే సీన్ మరో భర్త తో కూడా రిపీట్ అయిందట.  రెండో వాడి పురుషాంగాన్ని కూడా అలానే కొరికి అవతల పారేయడంతో ఆ జపాన్ అమ్మాయి భయపడిందట. ఇలా అయితే నా జీవితం అడవి కాచిన వెన్నెలే అనుకుని పరిష్కారం కోసం ఒక మహా మంత్రగాడి దగ్గరకు వెళ్ళిందట.

ఆ మంత్రగాడు మన రజనీకాంతు టైపులో మంత్రించిన ఒక ఇనుప పురుషాంగాన్ని ఆ అమ్మాయి యోనిలో కి ప్రవేశ పెట్టాడట. అబ్బ.. మరో పురుషాంగం దొరికింది కదా అని ఆశగా కొరికి అవతల పారేయబోతే.. ఆ రాక్షసి పప్పులు ఉడకలేదు.. కొరకడంలో పళ్ళు కాస్తా ఊడిపోయాయి. అమ్మాయికి ఆ రాక్షసి నుండి విముక్తి కలిగింది.  అప్పటి నుంచి ఆ ఇనుప పురుషాంగానికి గుడి కట్టి పూజిస్తున్నారట.   అబ్బే ఇట్టాంటి పెనిస్ -వెజైనా స్టోరీస్ మేం నమ్మం.. మేము హేతువాదులము.. మీరు నమ్మకండి అని ఎన్ని చెప్పినా కవాసాకి ఊరి జనాలు చచ్చినా వినరు. పురుషాంగం పండుగను చేసుకోవడం ఆపరు.

ఈ ఏడాది కూడా పురుషాంగం పండుగను ఎంతో భక్తిప్రపత్తులతో శ్రద్ధగా కోలహలంగా జరుపుకున్నారు. ఇక ఈ పండుగ సందర్భంగా వారు ఏం చేస్తారంటే మికోషి పెరేడ్(ఊరేగింపు) లో పాల్గొంటారు.  పురుషాంగం టోపీలు.. పురుషాంగం డిజైన్ లో ఉండే వస్తువులను మనం రేబాన్ గ్లాసెస్ ను పెట్టుకుని పోజిచ్చినట్టుగా తగిలించుకుని నృత్యాలు చేస్తూ  హంగామా చేస్తారు.  ఇక పురుషాంగం లా ఉండే క్యాండీలను ఐస్ ఫ్రూట్ లను తనివితీరా చీకుతూ తింటారు!  ఇంక స్టోరీ అయిపోయింది అబ్బాయిలూ. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే గూగుల్ ను అడగండి!!