బాబు కోసం రంగంలోకి కమ్మ లాబీ!?

Fri Aug 10 2018 13:29:21 GMT+0530 (IST)

Kamma Community Lobbying for Chandrababu Naidu for Next Elections

ఓ వైపు జగన్ పాదయాత్ర.. మరోవైపు బీజేపీ దండయాత్ర.. మధ్యలో పవన్ చురుకైన పాత్ర.. ఇలా ఏపీ రాజకీయ యవనికపై టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు జగన్ పాదయాత్రకు వస్తున్న మైలేజ్ చూసి టీడీపీ శిబిరంలో గుబులు మొదలైంది.టీడీపీ రెండోసారి అధికారంలోకి రావడం కష్టమని ఆ పార్టీ శిభిరం దాదాపు ఒక అంచనాకు వచ్చేశారా.? అందుకే తాజాగా కమ్మ లాబీ మొత్తం మీటింగ్ పెట్టి కార్యాచరణ ప్రారంభించారా? అంటే ఔననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు.. పరిస్థితులు మారిపోతున్నాయి. మరో 8 నెలల్లో అధికారం చేతులు మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును గట్టెక్కించడానికి తాజాగా  ఆయన సామాజిక వర్గమైన కమ్మ లాబీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

కొద్ది రోజుల క్రితం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మీడియా అధినేత హైదరాబాద్ శివారు లోని ఓ సీక్రెట్ హౌస్ లో కమ్మ పారిశ్రామికవేత్తలు - వ్యాపారులతో సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ఈ భేటిలో చంద్రబాబు ఈసారి గెలవడం అంత ఈజీగా కాదని.. ఇందుకోసం మనమందరం కలిసి బాబుకు అండగా నిలవాలని.. లేకుంటా కమ్మ సామాజికవర్గం అధికారం కోల్పోవడం ఖాయమని ఆందోళన చెందినట్టు తెలిసింది. ఎలాగైనా సరే జగన్ ను అధికారంలోకి రాకుండా చేసేందుకు కమ్మ గ్రూపంతా కలిసి పనిచేయాలని తీర్మానించినట్టు తెలిసింది. టీడీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో లాబీయింగ్ చేయాలని అనుకున్నట్టు సమాచారం.

ఇలా 2014లో కూడా ఇదే కమ్మ లాబీ తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబు-బీజేపీ లేకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. జనాలను డైవర్ట్ చేసి అధికారం కొల్లగొట్టారు. ఆ ఎన్నికల్లో దాదాపు గెలుస్తాడనుకున్న జగన్ ను ఈ లాబీ తప్పుడు ప్రచారం దెబ్బతీసింది. ఇప్పుడు మరోసారి అలాంటి జిమ్మిక్కులు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. జగన్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిసి మళ్లీ కమ్మలాబీ చేస్తున్న ఈ ప్రయత్నాలు సంచలనంగా మారాయి.