Begin typing your search above and press return to search.

కరోనా చావు ఎంత భయంకరమో చెప్పిన డాక్టర్

By:  Tupaki Desk   |   28 March 2020 7:30 PM GMT
కరోనా చావు ఎంత భయంకరమో చెప్పిన డాక్టర్
X
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టుకుంది. ఎంతో మందిని ఆస్పత్రుల పాలు చేసింది. వేల మంది చని పోయారు. లక్షలాది మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ కరోనా చావు ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పింది న్యూయార్క్ కు చెందిన భారతీ సంతతి వైద్యురాలు డాక్టర్ కామినీ దూబే. న్యూయార్స్ వర్సిటీ లాంగోన్ మెడికల్ సెంటర్, బెలెవ్యూ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆమె స్వయంగా కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా కరోనా చావు ఎంత భయంకరోమో చెప్పిందామె. ఆమె మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి..

డాక్టర్ కామినీ దూబే మాట్లాడుతూ ‘ఎందరో కరోనా సోకి ఆస్పత్రుల ఐసోలేషన్ వార్డుల్లో ఒంటరిగా గడుపుతున్నారు. తమ వారికి ఫోన్ చేసి కన్నీటి పర్యంతమవుతున్నారు. అయిన వాళ్లను కడసారి చూపునకు నోచుకోకుండా చని పోతున్నారు. వారి పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తే ఎంత బాధ ఉంటుందో ఓ డాక్టర్ గా తనకు తెలుసు.. మీకు అలాంటి కరోనా అవసరమా? సామాజిక దూరం పాటించండి.. వైరస్ ను నియంత్రించండి’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు కరోనా తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

ఒఖ వ్యాధితో ఇంతమంది చనిపోవడం తానెప్పుడూ చూడలేదని డాక్టర్ కామినీ తెలిపారు. కరోనా చికిత్స చేస్తే తమకు కూడా ముప్పు ఉంటుందని.. కానీ తప్పదని.. ఇలా అమరులు అవ్వడానికి మేం వైద్య వృత్తిలోకి అడుగు పెట్టలేదని.. యుద్ధభూమిలో ఇలాంటివి తప్పవు అని వివరణ ఇచ్చారు. ప్రజలు అర్థం చేసుకొని వైరస్ వ్యాప్తిని అరికట్టాలి అంటూ డాక్టర్ కామిని చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కనువిప్పు కలిగిస్తున్నాయి.