Begin typing your search above and press return to search.

తప్పని తెగేసి చెప్పిన హరిక్రిష్ణ వారసుడు

By:  Tupaki Desk   |   22 Sep 2022 11:39 AM GMT
తప్పని తెగేసి చెప్పిన హరిక్రిష్ణ వారసుడు
X
తప్పుని తప్పు అని చెప్పడం ఎన్టీయార్ కి బాగా అలవాటు. ఆయన ఆ విషయంలో మొహమాటాలకు పోరు, ఎవరో ఏదో అనుకుంటారని కూడా అసలు తగ్గరు. అలాంటి లక్షణాలు ఆయన తరువాత కొడుకుల్లో హరిక్రిష్ణకు మాత్రమే వచ్చాయి. ఆయన కూడా ముక్కుసూటి తనంతోనే తన జీవితాన్ని తుదిదాకా కొనసాగించారు. ఇపుడు ఆయన వారసులుగా ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో అగ్ర నటుడు జూనియర్ ఎన్టీయార్ హుందాగా స్పందిస్తే పెద్ద కొడుకు హీరో అయిన కళ్యాణ్ రామ్ అయితే నిక్కచ్చిగానే రియాక్ట్ అయ్యారు.

తన తాతగారు ఏనాడో స్థాపించిన హెల్త్ యూనివర్శిటీ పేరుని ఇపుడు మార్చడమేంటని ఆయన నిగ్గదీశారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉనికి లో ఉన్న ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం పేరుని ఇపుడు అకస్మాత్తుగా మార్చడం తనకు బాధ అనిపించింది అని కళ్యాణ్ రా, ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం రాజకీయ లాభం కోసం చాలామంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అంటూ ఖండించారు కూడా. ఇక 1986లో తన తాత సీఎం గా ఉన్నపుడు వైద్య రంగంలో విశిష్ట సేవల కోసం ఈ విశ్వ విద్యాలయం స్థాపించబడింది అని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల విద్యార్హ్దులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి నాటి సీఎం ఎన్టీయార్ ఈ మహా విద్యాలయానికి అంకురార్పణ చేశారని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది అని కళ్యాణ్ రామ్ వివరించారు. లెక్కలేనంతమంది వైద్య నిపుణులను దేశానికి ఈ విశ్వవిద్యాయలం అందించింది అని ఆయన గుర్తు చేశారు. అలాంటి హెల్త్ వర్శిటీకి పేరు మార్చడం తప్పున్నర తప్పు అనే కళ్యాణ్ రామ్ కుండబద్ధలు కొట్టారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే నందమూరి ఫ్యామిలీ అంతా ఈ విషయాన బాధతో ఆవేదనతో ఉంది. ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతున్నా అందులో భావం తాత్పర్యం ఒక్కటే. మరి దాన్ని వైసీపీ సర్కార్ సానుకూలంగా తీసుకుని హెల్త్ వర్శిటీకి ఎన్టీయార్ పేరు మార్పు ఆలోచనను మార్చుకుంటే మంచిది అన్న మాట అయితే ఉంది మరి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.