పవన్ పొత్తుపై కేటీఆర్ ఎటకారం మామూలుగా లేదుగా?

Fri Jan 17 2020 14:09:13 GMT+0530 (IST)

KTR on About Pawan kalyan Alliance with BJP

పండుగ మత్తు నుంచి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు తెలుగు ప్రజలు. గడిచిన మూడు నాలుగు రోజులుగా తెలంగాణలో పెద్దగా యాక్టివిటీ లేదు. పుర ఎన్నికల కారణంగా కాస్తంత ప్రచార హడావుడి మినహా.. రాజకీయంగా కాస్త డల్ గానే ఉంది. దీనికి భిన్నంగా ఏపీ పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ రోజు మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. పుర ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతూ.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉంటే.. ఏపీలో బీజేపీ.. జనసేన మధ్య కుదిరిన పొత్తుపై ప్రశ్నించగా.. తనదైన శైలిలో స్పందించారు. పొత్తుపై ఇప్పటికప్పుడు స్పందించలేనన్న ఆయన.. జనసేన అంతర్జాతీయపార్టీ కూడా కావొచ్చేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఎటకారాన్ని కుమ్మరించేశారు. అంతలోనే సర్దుకొని.. పక్క రాష్ట్రంలో ఏం చేస్తే తమకేమిటంటూ టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు.

పొత్తుపై పక్కనున్న ఏపీ ప్రజలు చూసుకుంటారని చెప్పటం చూస్తే.. కేటీఆర్ తెలివంతా కనిపిస్తుంది. ప్రశ్న అడిగినంతనే తాను చెప్పాలనుకున్న మాటను చెప్పేసిన ఆయన.. అదే సమయంలో పక్క రాష్ట్రమంటూ మరిన్ని ప్రశ్నల్ని సంధించకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పక తప్పదు. అయినా.. పక్కరాష్ట్ర వ్యవహారమైతే.. ప్రశ్న అడిగింది మొదలే చెప్పకుండా ఉంటారు. అందుకు భిన్నంగా.. తాను అనాల్సిన మాట అనేసి.. ఆ తర్వాత మాత్రం పక్క రాష్ట్రమని చెప్పటం చూస్తే.. మంత్రి కేటీఆర్ తెలివి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పక తప్పదు.