Begin typing your search above and press return to search.

ఎన్ కౌంటర్ వెనుక కేటీఆర్ కీ రోల్ ?

By:  Tupaki Desk   |   6 Dec 2019 7:20 AM GMT
ఎన్ కౌంటర్ వెనుక కేటీఆర్ కీ రోల్ ?
X
దేశాన్ని కుదిపేసిన దిశ హత్యాచార ఘటన తెలంగాణ సర్కారును అభాసుపాలు చేసింది. తెలంగాణ పోలీసులకు చెడ్డపేరు తెచ్చింది. చట్టాల్లోని లొసుగులు నిందితుల కేసు విచారణలో జాప్యానికి కారణమయ్యాయి. దీంతో జనాల్లో ఆగ్రహవేశాలు పెల్లుబుకాయి. అయితే తెలంగాణ పోలీసులు ఈ నలుగురు నిందితులను ఈరోజు ఉదయం ఎన్ కౌంటర్ చేసి సభ్యసమాజానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారు. ప్రజలు కోరుకున్నట్టే ఎన్ కౌంటర్ చేశారు. దీంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు.

అయితే దిశ హంతకుల ఎన్ కౌంటర్ తో ఇప్పుడు తెలంగాణ ప్రజల దృష్టిలో సీపీ సజ్జనార్ హీరో అయిపోయాడు. ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే నిందితుల ఎన్ కౌంటర్ విషయం లో కేసును ప్రత్యక్షం గా పర్యవేక్షిస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్ హస్తం ఉందని తెలుగు రాష్ట్రాల మహిళా లోకం ప్రశంసలు కురిపిస్తోంది.

నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసింది సీపీ సజ్జనార్ కాగా ఆయన వెనుకుండి నడిపించింది మంత్రి కేటీఆర్ అని.. ఈ క్రెడిట్ మంత్రి కేటీఆర్ కే దక్కుతుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. దిశ హత్యపై కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా ప్రధాని మోడీకి కూడా ఈ ఘటనపై ట్వీట్ చేస్తూ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ఆయన కోరారు. అంతేకాదు కుటుంబానికి న్యాయం చేయాలంటూ మోడీ కి ట్వీట్ చేశారు కేటీఆర్.

ఇక దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసిన మంత్రుల పై కూడా కేసీఆర్ సీరియస్ అయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. మంత్రులు ఇష్టానుసారం మాట్లాడవద్దని హెచ్చరించారు.

నిన్న హైదరాబాద్ లో జరిగిన సమావేశంలోనూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశా కుటుంబ సభ్యులకు ఎలాంటి న్యాయం చేయకపోతే ఏం లాభం అని కూడా ప్రధాని మోడీని ప్రశ్నించారు. న్యాయం చేయడంలో జాప్యం జరిగితే అన్యాయం చేసినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకున్నట్టు ఎన్ కౌంటర్ చేయడంలో తప్పు లేదని.. కానీ తాను మంత్రి హోదాలో ఇలా సపోర్ట్ చేయలేనని కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. దిశ కేసు విషయంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలిసింది. కేటీఆర్ కామెంట్ చేసిన తెల్లవారే ఈ ఎన్ కౌంటర్ జరగడంతో దీని వెనుకున్నది కేటీఆర్ అని.. ముందుండి నడిపించింది సజ్జనార్ అని అందరూ భావిస్తున్నారు.