సీఏఏ అమలు చేయం.. కేటీఆర్ సంచలనం

Sat Jan 18 2020 12:28:31 GMT+0530 (IST)

KTR Sensational Decission on CAA

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మంటలు ఆరడం లేదు. ఇక బీజేపీ తెస్తోన్న ఎన్నార్సీపై వివాదాలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ తెచ్చిన సీఏఏను అమలు చేయమని చాలా రాష్ట్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కారు మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు.ఇటీవలే తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ రాష్ట్రంలో ఎన్నార్సీని అమలు చేయమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారికంగా కేటీఆర్ ఈ విషయంపై తాజాగా స్పందించారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని తాము తిరస్కరిస్తున్నామని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి హోదాలో కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. సీఏఏ అమోదయోగ్యం కాదని.. ఎన్పీఆర్ - ఎన్నార్సీలు అమలు చేశాక వాటిపై నిర్ణయిస్తామని తెలిపారు.

టీఆర్ ఎస్ లౌకిక పార్టీ అని.. అందుకే సీఏఏను తిరస్కరిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలోకి ముస్లింలను రాకుండా చేసే సీఏఏను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

    

TAGS: KTR CAA