ఘనంగా కేఎల్ రాహుల్ అతియా శెట్టిల వివాహం..!

Mon Jan 23 2023 14:46:07 GMT+0530 (India Standard Time)

KL Rahul and Athiya Shetty Get Married

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ప్రియురాలు అయిన బాలీవుడ్ బ్యూటీ అతియాశెట్టి నేడు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. బంధువులు స్నేహితులందరి ముందు ఈరోజు కేఎల్ రాహుల్.. అతియా మెడలో తాళి కట్టబోతున్నాడు. మహారాష్ట్ర ఖండాలాలోని ఫామ్ హౌస్ వీరి పెళ్లికి వేదిక కాబోతుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకే వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు.వంద మంది మాత్రమే వీరి వివాహ మహోత్సవంలో పాల్గొననున్నారు. అయితే పెళ్లిలో ఫోటోలు వీడియోలు తీయకూడదని.. సోషల్ మీడియాలో పెట్టకూడదని వారికి సూచించినట్లు సమాచారం.

పెళ్లి వేడుకలో భాగంగానే ఆదివారం రోజు ఉదయం ఘనంగా మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేరోజు సాయంత్రం సంగీత్ నిర్వహించగా.. వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు పలు బాలీవుడ్ పాటలకు నృత్యాలు చేశారు. సోమవారం రోజు ఉదయం హల్దీ జరగగా... సాయంత్రం పెళ్లి జరగబోతోంది. గత రెండ్రోజులుగా ఖండాలాలోని ఫాం హౌస్ వెలుగులతో మెరిసిపోతోంది. అతిథుల రాకతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.

అయితే పెళ్లి అయ్యాక రాహుల్ అతియాలు.. ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వారు ఫ్రీ అయ్యాకే అంటే ఈ ఏడాది ఐపీఎల్ పూర్తయ్యాకే వివాహ విందు ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముంబయి వేదికగా సుమారు మూడు వేల మంది అతిథులకు ఆ వివాహ విందు ఇవ్వనున్నారని సమాచారం.  అంతే కాకుండా బెంగళూరులో మరో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు సాయంత్రం జరగబోయే పెళ్లికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జాకీష్రాఫ్ అక్షయ్ కుమార్ షారుక్ ఖాన్ అమీర్ ఖాన్ హృతిక్ రోషన్ అమితాబ్ బచ్చన్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు క్రికెటర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది.

అలాగే వివాహ మహోత్సవం పూర్తయిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు కొత్త జంట మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మరి వాళ్లు ఏం మాట్లాడబోతున్నారు వీరి పెళ్లికి ఎవరెవరు హాజరు కాబోతున్నారో తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు ఆగాల్సిందే.       నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.