Begin typing your search above and press return to search.

కేసీఆర్ సంచలన నిర్ణయం .. మారిపోనున్న హైదరాబాద్ రూపురేఖలు !

By:  Tupaki Desk   |   6 Aug 2020 1:30 PM GMT
కేసీఆర్ సంచలన నిర్ణయం .. మారిపోనున్న హైదరాబాద్ రూపురేఖలు !
X
తెలంగాణ రాజధాని , దేశంలో ఐటీకి కేరాఫ్ గా మారుతున్న హైదరాబాద్ సిటీని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే .. గత కొన్నేళ్లుగా ఎక్కువ అభివృద్ధి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా సాగుతున్నట్లు స్పష్టంగా అభివృద్ధి. ప్రముఖ ఐటీ కంపెనీలు అన్ని కూడా అక్కడే ఉండటం ..అలాగే పలు ప్రాజెక్టులు పైప్ లైన్ తో ఉండటంతో హైదరాబాద్ మహానగరానికి పశ్చిమభాగం ఒక కిరీటంలా తయారైంది. ఇదే పరిస్థితి ఇంకొంత కాలం కొనసాగితే సిటీకే ప్రమాదం. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈస్ట్ వైపు అభివృద్ధి కి నాంది పలికింది. ఉప్పల్ ప్రాంతం వైపు ఐటీ ప్రాజెక్టులు వచ్చేలా ప్లాన్ చేసిందిదే. అయితే, అక్కడ అనుకున్నంతగా ఐటీ కంపెనీలు రావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఐటీ కారిడార్ ఉండే పశ్చిమ ప్రాంతంతప్ప.. హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల్నిఏర్పాటు చేస్తే భారీ ఎత్తున ప్రోత్సాహాకాలు ఇవ్వాలని భావిస్తోంది.

దీనికోసం కేసీఆర్ సర్కార్ కొత్త పాలసీని తీసుకురాబోతుంది. ఉత్తరాన కొంపల్లి.. దాని పరిసర ప్రాంతాలు.. తూర్పున ఉప్పల్.. పోచారం.. దక్షిణాన శంషాబాద్.. ఆదిభట్ల.. కొల్లూరు.. ఉస్మాన్ నగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే ఐటీ కంపెనీలకు ప్రోత్సహాకాలు ఉంటాయనిచెప్తుంది. ఇలా చేస్తే నగరం నలుమూలల ఐటీ పరిశ్రమలు వస్తే.హైదరాబాద్ వ్యాప్తంగా ఐటీ గ్రిడ్ ఏర్పడటమే కాదు, పశ్చిమ ప్రాంతంపైన భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చెప్పిన విధంగా అక్కడ ఐటీ కంపెనీలని నెలకొల్పితే.. విద్యుత్ తో పాటు, అద్దె తదితర అంశాల్లో ప్రోత్సహాకాలు ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్లు సాగితే, వచ్చే ఐదేళ్లలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం చెప్పినట్లుగా కంపెనీలు ప్రోత్సాహాకాలు సొంతం చేసుకోవాలంటే ఐదేళ్లలో పరిశ్రమల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ప్రభుత్వం ఊహించే విదంగా నగరం నలుమూలల ఐటీ సంస్థలు ఏర్పాటు అయితే హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు ఓ గచ్చిబౌలి , మాదాపూర్ , హైటెక్ సిటీ లా మారిపోతాయి.