Begin typing your search above and press return to search.

జాతీయ రాజకీయాల వైపు మళ్లీ కేసీఆర్ ?

By:  Tupaki Desk   |   24 Nov 2020 8:30 AM GMT
జాతీయ రాజకీయాల వైపు మళ్లీ కేసీఆర్ ?
X
2019 సార్వత్రిక ఎన్నికల్లోనే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. కేంద్రంలోని బీజేపీకి మెజార్టీ తగ్గితే తనకున్న పరిచయాలు, బలంతో కేంద్రంలో పాగావేయాలని.. జాతీయ రాజకీయాలను శాసించాలని ప్లాన్ చేశారు. కానీ బ్యాడ్ లక్. కేంద్రంలో బీజేపీకి క్లియర్ కట్ మెజార్టీ రావడంతో కేసీఆర్ ఆశలు అడియాశలయ్యాయి.

అయితే తాజాగా దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడడం.. బీజేపీ గెలవడం.. తెలంగాణపై బీజేపీ నజర్ ఎక్కువ కావడంతో ఇక బీజేపీని ఢీకొట్టడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు. దేశానికి కొత్త దిశ, దశ చూపించాల్సిన టైం వచ్చిదంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ డిసెంబర్ రెండో వారం తర్వాత ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కేటీఆర్ ను సీఎం చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళతారనే ప్రచారం సాగింది. కేసీఆర్ ప్రధాని అవుతారని.. కేటీఆర్ సీఎం అవుతారని అందరూ భావించారు.

కొత్త రాజకీయాలకు తానే ఆవిష్కర్తను అవుతానంటూ కేసీఆర్ ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అట్టర్ ఫ్లాప్ అని కేసీఆర్ టార్గెట్ చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ గులాబీ బాస్ మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.. బీజేపీ వంచన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బీజేపీపై యుద్ధం ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్టు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది.. మరి కేసీఆర్ ఏం చేయనున్నారన్నది వేచిచూడాలి.