కూతురు కోసం కేసీఆర్ సంచలన నిర్ణయం?

Mon May 27 2019 12:10:48 GMT+0530 (IST)

KCR Wants to Kavitha To Contest From huzurnagar Bypolls

ఎవరు ఓడినా.. ఎవరూ గెలిచానా అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంతి.. పైగా తెలంగాణలో స్వీప్ చేసిన టీఆర్ఎస్ అధినేత కూతురు ఓడితే మాత్రం అది దేశవ్యాప్తంగా సంచలనమవుతుంది. అదే జరిగింది. కేసీఆర్ కూతురు కవితను ఓడించావా అని బీజేపీ సీనియర్ నేత గడ్కరీ.. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ గురించి ఆరాతీశాడంటే అర్థం చేసుకోవచ్చు.ఈసారి కవిత గెలిస్తే పార్లమెంట్ లో కీరోల్ పోషించేంది. పార్లమెంటరీ నేతగా.. లేదా ఉపనేతగా ఉండేవారు. టీఆర్ ఎస్ ఎంపీల్లో కేసీఆర్ కూతురిగా.. సీనియర్ గా ఆధిపత్యం చెలాయించేవారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది.

నిజామాబాద్ ఎంపీగా ఓడిన తర్వాత కవిత బయటకు రాలేదు. కేవలం ఒక ట్వీట్ తప్ప ఆమె మీడియా కంటపడలేదు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధి లో మొన్నటి ఎన్నికల వేళ  7 అసెంబ్లీ సీట్లను టీఆర్ ఎస్ గెలిచేలా చేసి దిగ్గజ కాంగ్రెస్ నేత అయిన జీవన్ రెడ్డిని సైతం ఓడించి కవిత సత్తా చాటింది. అలాంటి కవిత పార్లమెంట్ లో ఓటమితో నైరాశ్యంలో కూరుకుపోయిందని సమాచారం. అందుకే కూతురును మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకురావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం.

ముందుగా రాజ్యసభకు కవితను పంపియాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. కానీ అలా దొడ్డిదారిన వెళితే క్రెడిబులిటీ ఉండదని.. కేసీఆర్ కూతురుగా పోటీచేసి గెలిస్తేనే బెటర్ అన్న ఆలోచనలో కవిత ఉన్నట్టు తెలిసింది. అందుకే కేసీఆర్ కూడా ప్లాన్ మార్చినట్టు సమాచారం..

హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఉత్తమ్ నల్లగొండ ఎంపీగా గెలిచి వెళుతుండడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ స్థానంలో కవితను నిలబెట్టి గెలిపించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి.హుజూర్ నగర్ లో కవితను గెలిపించే బాధ్యతను ఓటమి ఎరుగని ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది.  కూతురు కవితను అసెంబ్లీలో ఈ ఐదేళ్లు చూడాలని.. వీలైతే ఆమెకు మహిళా కోటలో మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందనేది రాబోయే ఆరు నెలల్లో తేలుతుంది.