Begin typing your search above and press return to search.

ఆడపిల్లల వైపు చూస్తే కళ్లు పీకేస్తాం .. కేసీఆర్ వీడియో వైరల్ !

By:  Tupaki Desk   |   6 Dec 2019 10:07 AM GMT
ఆడపిల్లల వైపు చూస్తే కళ్లు పీకేస్తాం .. కేసీఆర్ వీడియో వైరల్ !
X
ప్రపంచం తో పోటీగా మనం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ ..ఈ సమాజంలో మహిళల పై రోజురోజుకి దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం , పోలీసులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ఇలాంటి ఘటనలు ఆపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారం క్రితం హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ కేసులో నిందుతులుగా ఉన్న నలుగురు ఎన్‌కౌంటర్ అయ్యారు. శంషాబాద్ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే క్రమంలో నలుగురు పోలీసులపై దాడికి ప్రయత్నించి.. పారిపోయే క్రమంలో కాల్చి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రజలతో పాటుగా , పలువురు ప్రముఖులు , టాలీవుడ్ సినీ స్టార్స్ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు సరైన శిక్ష పడిందంటున్నారు.. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, తెలంగాణ పోలీసులుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో ఒక సభ లో సీఎం కేసీఆర్ మహిళల భద్రతపై స్పందించిన సమయంలో చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడిపోవాలి అని , ఎవరైనా కన్ను ఎత్తి చూస్తే కళ్లు పీకేస్తామని చేసిన ఆ వ్యాఖ్యల్ని ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. గతంలో సీఎం కేసీఆర్ మాట్లాడిన ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కేసీఆర్ గతంలో చెప్పిన మాటను ఇప్పుడు చేసి చూపించారంటున్నారు. అలాగే సీఎం కేసీఆర్ మాటల సీఎం కాదు ..చేతల సీఎం అంటూ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి