Begin typing your search above and press return to search.

పండుగ‌లా కొండ‌పోచమ్మ రిజ‌ర్వాయ‌ర్ ప్రారంభోత్స‌వం

By:  Tupaki Desk   |   29 May 2020 6:45 AM GMT
పండుగ‌లా కొండ‌పోచమ్మ రిజ‌ర్వాయ‌ర్ ప్రారంభోత్స‌వం
X
కాళేశ్వ‌రం ప్రాజెక్టు నుంచి గోదావ‌రి నీటిని సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున సిద్దిపేట జిల్లాలో మ‌ర్కూక్ వ‌ద్ద కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మించారు. దీన్ని ప్రారంభోత్స‌వం ఓ పండుగ‌లా జ‌రిగింది. ఈ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, శోభ దంపతులు శుక్ర‌వారం తెల్ల‌వారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొద‌లుపెట్టారు. కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్ ‌(మర్కూక్‌) వద్ద సుదర్శన యాగం, ప్రాజెక్టు నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగంలో కేసీఆర్ దంప‌తులు పాల్గొన్నారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌ దంపతులు చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొన్నారు. కేసీఆర్‌ వెంట మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు.

పూర్ణాహుతి ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌ మర్కూక్‌ పంప్‌హౌస్‌ వద్దకు చేరుకొని చినజీయర్‌ స్వామిని క‌లిసి అనంత‌రం అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొని పూజ‌లు చేశారు. అనంతరం 11.30 గంటలకు పంప్‌హౌస్‌లలోని రెండు మోటార్లను ఆన్‌ చేసి గోదావరి నీళ్లు వ‌దిలి గంగా హార‌తి ఇచ్చారు.