Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఐడియా సూపర్.. ఇలా చేస్తే టీఆర్‌ఎస్ కే లాభమట...!

By:  Tupaki Desk   |   3 Dec 2021 7:30 AM GMT
కేసీఆర్ ఐడియా సూపర్.. ఇలా చేస్తే టీఆర్‌ఎస్ కే లాభమట...!
X
కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ ఒక పట్టాన బోధ పడవు. ఆయన రూటే సపరేటు. కాలానికి పరిస్థితులకు అనుగుణంగా చాణక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పవరకు ఢిల్లీ పెద్దలతో దోస్తీ కట్టిన కేసీఆర్.. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కయ్యానికి సై అంటున్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కేంద్రంతో కేసీఆర్ తపపపడం కొత్తేమీ కాదు. గతంలోనూ బీజేపీతో ఢీ అంటే ఢీ అన్న సందర్భాలున్నాయి. ఆయనకు కమలం పార్టీపై వ్యతిరేకత ఓకే విధంగా ఉండేది. పరిస్థితులకు అనుగుణంగా కేంద్రంలో ఎలా ఉండాలనే దానిపై కేసీఆర్ స్పష్టత ఉండేది. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో కేసీఆర్ కు పుల్ క్లారిటీ ఉండేది.

ఇప్పుడు కేసీఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో కాషాయపార్టీతో కుస్తీ.. కేంద్రంలో దోస్తీ అన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో బీజేపీపై విరుచుకపడే కేసీఆర్.. ఢిల్లీలో వెళ్లి వచ్చిన తర్వాత అనేక అనుమానాలు వ్యక్తమయ్యేవి. ఢిల్లీ పెద్దల పట్ల భక్తిని ప్రదర్శిస్తారనే విమర్శలున్నాయి. ఇక కాంగ్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరంలేదు. కేసీఆర్, ఢిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డితో సహ ఇతర కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టేవారు. అయితే వరి ధాన్యం కొలుగోలుపై ఢిల్లీ తిరిగి వచ్చిన కేసీఆర్ స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో ఢిల్లీ పర్యటన వివరాలను ఆయన గోప్యంగా పెట్టేవారు. ఈ సారి మాత్రం కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాననే సంకేతాలు పంపుతున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు కేంద్రంపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో.. పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత అంతకంటే తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

కేసీఆర్, బీజేపీ సిగపట్లు చూస్తుంటే పైకి మాత్రం ధాన్యం కొలుగోలుపై పోరాటం అన్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ కేంద్రంపై ఒకే దోరణితో ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఇది కేవలం ధాన్యం కొనుగోలు అంశం కాదని అంతకుమించి ఏదో మర్మం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బీజేపీ, కాంగ్రెస్ ను ఒకే గాటన కట్టి విమర్శలు చేసేవారు. అయితే ఈ సారి ఎక్కడ కాంగ్రెస్ ప్రస్తావన లేదు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. రెండు రోజుల పాటు ఇందిరాపార్క్ వద్ద వరి దీక్ష చేశారు. కాంగ్రెస్ నేతలు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ పై పల్లెత్తు మాట కూడా అనడం లేదు. కేంద్రాన్నే దోషిగా నిలబెడుతున్నారు.

కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని కేసీఆర్ చేస్తున విమర్శల వెనుక ఏదో బలమైన వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహాలో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు. రాష్ట్రల పట్ల కేంద్రం తీరును తప్పుబట్టారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కొందరు నేతలను కలిశారు కూడా. ఆచరణలో ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాకపోయిన ప్రయత్నాలు మాత్రం ఆయన ఆపలేదు. ఇప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆలోచనకు కారణం లేకపోలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరాజయాన్ని చవిచూసింది.

అంతేకాదు దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ తగ్గుతూ వస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. వీటన్నింటి దృష్టి పెట్టుకుని కేంద్రం కాస్త పెట్రోల్ ధరలను నియంత్రించింది. అలాగే మూడు వివాదాస్పద రైతు చట్టాలను వెనక్కు తీసుకుంది. ఈ పరిణామాలను గమనించిన కేసీఆర్.. కేంద్రంలో ఎంత పోరాటం చేస్తే అంత లాభమనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి బీజేపీపై ఇంకా వ్యతిరేకత వస్తే అవకాశం ఉందని, అందువల్ల బీజేపీతో దూరంగా ఉంటేనే టీఆర్‌ఎస్ లాభమని కేసీఆర్ భావిస్తున్నారు. తీరా ఎన్నిక సమయానికి కేంద్రం తీరును తప్పుబడితే మొదటికే మోసం వస్తుందని, అందువల్ల ఇప్పటికే నుంచే పలు అంశాలపై కేంద్రంతో పోరాడాలని కేసీఆర్ అనుకుంటున్నారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి.