Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు పై కేసీఆర్ ఫీల్ అవుతున్నారా?

By:  Tupaki Desk   |   13 Nov 2019 8:03 AM GMT
అయోధ్య తీర్పు పై కేసీఆర్ ఫీల్ అవుతున్నారా?
X
యావత్ దేశం మొత్తం ఉత్కం టతో ఎదురు చూసిన తీర్పు ను సుప్రీం కోర్టు వెలువరించటం తెలిసిందే. దశాబ్దాల పర్యంతం సాగిన అయోధ్య ఇష్యూను ఒక కొలిక్కి తీసుకొస్తూ అత్యున్నత న్యాయ స్థానం చారిత్రక తీర్పు ను వెలువరించటం తెలిసిందే. అయోధ్య అంశం పై సుప్రీం కోర్టు వెలువరించి తీర్పు పై సర్వత్రా హర్షం వ్యక్తం కావటం తో పాటు.. పలువురు ప్రముఖులు స్పందించారు.

అయితే.. ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్రముఖ్య మంత్రి కేసీఆర్ మాత్రం మౌనం గా ఉన్నారు. ఆయన ఎలాంటి వ్యాఖ్యను చేయలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రాములమ్మ అలియాస్ విజయ శాంతి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై స్పందించకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పించుకున్నారని.. దాని వెనుక చాలా పెద్ద మతలబు ఉందన్నారు.

దేశమంతా రామ మందిర నిర్మాణానికి సంబంధించి హర్షాతి రేకాలు వ్యక్తం చేస్తున్న వేళ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నం గా మౌనం గా ఉండటం వెనుక మజ్లిస్ ప్రాపకం కోసమే అని ఆమె తప్పు పట్టారు. తెలంగాణ సీఎం దొరగారు మాత్రం సెక్యులరిజం పేరుతో.. మజ్లిస్ ప్రాపకం కోసం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు.

తాజాగా ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్టు పెట్టిన విజయ శాంతి.. తన వాదనకు నిదర్శనంగా రెండు నిమిషాలకు పైనే నిడివి ఉన్న ఒక పాత వీడియోను లింక్ చేశారు. అయోధ్య అంశం పై గతం లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలున్న ఆ వీడియో ను చూపిస్తూ..తాను చేస్తున్న వ్యాఖ్యలు అర్థవంతమైనవన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.

సోషల్ మీడియా లో రాములమ్మ పెట్టిన పోస్టు లోని అంశాన్ని యథాతధం గా చూస్తే.. "పైకి తాను అసలైన హిందువు అని చెప్పుకునే కేసీఆర్ గారికి.. లోలోపల రామమందిరం నిర్మాణం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో గతం లో ఆయన చేసిన కామెంట్‌ ను చూస్తే అర్థమవుతుంది. రామమందిరం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని... అయోధ్య అంశాన్ని తోక తో పోలుస్తూ గతం లో కెసిఆర్ గారు విమర్శించడం దొరగారి అహంకారానికి నిదర్శనం. ఇంతకు ముందు తన మనసు లోని మాటను బయట పెట్టిన కెసిఆర్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉండటం తో జీర్ణించుకోలేకపోతున్నారేమో? దీన్నే కుహనా లౌకిక వాదం అంటారు... గతంలో కెసిఆర్ గారు రామమందిరం పై ఏమన్నారో, ఈ వీడియో చూస్తే, దొరగారి అసలు నిజం అర్థమవుతుంది" అని పేర్కొన్నారు. మరి.. దీనికి సీఎం కేసీఆర్ రియాక్ట్ అవుతారంటారా?