Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫెడ‌ర‌ల్ క‌ల‌ను కోల్డ్ స్టోరేజీలో పెట్టాల్సిందేనా?

By:  Tupaki Desk   |   20 May 2019 1:30 AM GMT
కేసీఆర్ ఫెడ‌ర‌ల్ క‌ల‌ను కోల్డ్ స్టోరేజీలో పెట్టాల్సిందేనా?
X
ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల‌య్యాయి. ఏపీ.. తెలంగాణ‌కు సంబంధించినంత వ‌ర‌కూ కీల‌క మీడియా సంస్థ‌ల‌న్ని ఒకే లెక్క‌ను చెప్పేశాయి. ఏపీలో జ‌గ‌న్ కు అధికారం ఖాయ‌మ‌ని తేల్చ‌గా.. తెలంగాణ‌లో కేసీఆర్ కు అత్య‌ధిక ఎంపీ స్థానాలు ఖాయ‌మ‌న్న మాట‌ను చెప్పేశాయి. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. కేంద్రంలో మోడీకి అధికారం త‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పాయి. అత్య‌ధిక మీడియా సంస్థ‌లు..స‌ర్వే సంస్థ‌లు మోడీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌టం ఖాయ‌మ‌ని. మేజిక్ ఫిగ‌ర్ ను సింఫుల్ గా దాటేస్తార‌ని స్ప‌ష్టం చేశాయి.

చాలా సంస్థ‌లు 300ల‌కు పైనే సీట్లు ఖాయ‌మ‌న్న మాట‌ను స్ప‌ష్టం చేశాయి. మ‌రీ.. అంచ‌నాలు కేసీఆర్ కు కాసింత షాక్ త‌గిలించేవే. కేంద్రంలో ఈసారి కాంగ్రెస్‌.. బీజేపీకి పెద్ద‌గా సీట్లు రావ‌ని.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అవ‌స‌ర‌మ‌న్న వాద‌న‌ను వినిపించారు. ఇందులో భాగంగా ఈ మ‌ధ్య‌న త‌మిళ‌నాడు.. కేర‌ళ‌కు వెళ్లిరావ‌ట‌మే కాదు.. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితోనే మంత‌నాలు జ‌రిపారు. కేంద్రంలో ఏ పార్టీకి స‌రైన సీట్లు రావ‌ని.. ప్రాంతీయ పార్టీల హ‌వా న‌డుస్తుంద‌న్న అంచ‌నాను ఆయ‌న బ‌లంగా వినిపించారు.

ఇందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఉండ‌టం ఇప్పుడు కేసీఆర్ కు మింగుడు ప‌డ‌టం క‌ష్ట‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజ‌మై.. వారి అంచ‌నాలు క‌రెక్ట్ అయిన ప‌క్షంలో.. మ‌రో ఐదేళ్ల పాటు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను కోల్ట్ స్టోరేజీలో పెట్టేయాల్సిన అవ‌స‌రం కేసీఆర్ కు ఉంటుందని చెప్ప‌క త‌ప్ప‌దు.