అసంతృప్తి జ్వాలపై కేసీఆర్ ఆరా.. తేలిన నిజమిదే

Wed Sep 11 2019 11:21:20 GMT+0530 (IST)

KCR Enquiry About Rebel Leaders in TRS party

తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై ఉద్యమకాలంలో జరిగిన దాడి - అణిచివేత అంతా ఇంతాకాదు.. నాడు చంద్రబాబు నుంచి వైఎస్ - రోశయ్య - కిరణ్ కుమార్ రెడ్డి ల వరకు సీఎంలుగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పార్టీని టార్గెట్ చేసి తుత్తునియలు చేసినవారే. ముఖ్యంగా వైఎస్ - బాబు ఎక్కువగా కేసీఆర్ ను ఇబ్బందిపెట్టారు.అయితే గులాబీ దళపతి మాత్రం అన్నీ తట్టుకొని నిలబడ్డారు. కేసీఆర్ ను కాలదన్ని వెళ్లిన ఆలె నరేంద్ర - విజయకుమార్ - విజయశాంతి సహా ఎంతో మందికి ఆ తరువాత రాజకీయ మనుగడ లేకుండా పోయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో వారు గెలవలేకపోయారు. అందుకే అసమ్మతి - అసంతృప్తి జ్వాలలను ఎలా కంట్రోల్ చేయాలి.? పార్టీ వీడితే జరిగే పరిణామాలేంటో కేసీఆర్ కు బాగా తెలుసు..

తాజాగా టీఆర్ ఎస్ లో అసంతృప్తి - అసమ్మతి గళాలపై నేతలు నోరెత్తారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి - జోగురామన్న అలిగి వెళ్లిపోవడం.. రాజయ్య మాదిగలకు మంత్రి పదవి లేదనడం.. అరికపూడి గాంధీ అలకవహించడంపై కేసీఆర్ ఆరాతీశారట.. వీరంతా వ్యక్తిగత కారణాలతోనే ఇలా చేశారని కేసీఆర్ తెలుసుకున్నారట.. ఇంటెలిజెన్స్ ద్వారా  ఈ ప్రచారంపై ఆరాతీయగా.. కావాలనే కొన్ని శక్తులు తెలంగాణలో ఈ ప్రచారం చేయిస్తోందని కేసీఆర్ కు రిపోర్ట్ అందినట్టు సమాచారం.

మైనంపల్లి వ్యక్తిగత పనిమీద దుబాయ్ వెళ్లాడని.. జోగురామన్న ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రి పాలయ్యారని.. అరికపూడి అసంతృప్తి లేదని కేసీఆర్ ఆరాలో తెలిపినట్టు సమాచారం. రాజయ్య ఆ తర్వాత మెత్తబడడం తెలిసిందే..

గులాబీ దళంలో అసమ్మతి ప్రచారం వెనుక బీజేపీ హస్తం ఉందని టీఆర్ ఎస్ అధిష్టానం అనుమానిస్తోందట... కావాలనే కొందరు నేతలు అసమ్మతి రాజేశారని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేశారని కేసీఆర్ అండ్ కో తేల్చిందట.. పార్టీలో అసమ్మతి లేకున్నా మీడియాలో ఈ ప్రచారం పెట్టారని కేసీఆర్ నిగ్గుతేల్చారట.. సో తాజాగా కేటీఆర్ అలిగిన నేతలకు ఫోన్లు చేసినప్పుడు కూడా ఇదే విషయం బయటపడిందట.... మరీ ఈ పని బీజేపీ చేసిందా? లేక మరెవరైనా అనేదానిపై ఇప్పుడు గులాబీ అధిష్టానం సీరియస్ గా పరిశోధిస్తోందట..