Begin typing your search above and press return to search.

కేసీఆర్, రఘురామకృష్ణంరాజు పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   7 July 2020 5:36 PM GMT
కేసీఆర్, రఘురామకృష్ణంరాజు పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
X
తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీసులోనే 27మందికి కరోనా వచ్చిందని తెలిసిందని.. కేసీఆర్ కు కరోనా వచ్చిందో రాలేదో తెలియదని.. ఒకవేళ వచ్చి ఉంటే అది తగ్గాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు.. మత ప్రబోధకుడు కేఏ పాల్ అన్నారు. తాజాగా ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

కరోనాపై తాను తెలుగు రాష్ట్రాలకు ముందే హెచ్చరించినా పట్టించుకోలేదని పాల్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తన భవంతులు, కరోనా ఆస్పత్రులుగా వాడుకోవాలని చెప్పినా ఒక్కరూ పట్టించుకోలేదని.. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల సీఎంలు నా భవంతులు వాడుకోవాలని కేఏపాల్ సూచించారు.

ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పీఏకు రఘురామకృష్ణం రాజు ఫోన్ చేసి బెదిరించాడని కేఏ పాల్ వీడియోలో ఆరోపించారు. ఇలాంటి వారిని ప్రపంచంలో చాలా మందిని చూశానని కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చాడు. రఘురామ బెదిరించిన టెక్ట్స్ మెసేజ్ తన వద్ద ఉందని.. దాన్ని డీజీపీకి ఇస్తే అరెస్ట్ చేస్తారని పాల్ చెప్పుకొచ్చాడు. కానీ తాను ఆ పనిచేయలేదని అన్నాడు.

నర్సాపురంలో తనను గెలిపిస్తే ఎంతో అభివృద్ధి చేసేవాడినని.. కానీ రఘురామను గెలిపిస్తే ఆయన ఏడాది నుంచి పార్టీతో గొడవలు పెట్టుకుంటున్నాడని కేఏపాల్ విమర్శించారు. తాను ఎన్నో కోట్ల రూపాయలను తెచ్చి అభివృద్ధి చేసేవాడన్నారు.