Begin typing your search above and press return to search.

సీఎం జగన్ అపాయింట్ మెంట్ అడిగిన ఎన్టీఆర్?

By:  Tupaki Desk   |   21 July 2019 3:17 AM GMT
సీఎం జగన్ అపాయింట్ మెంట్ అడిగిన ఎన్టీఆర్?
X
ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీ బాధ్యతలు స్వీకరించాలి అనే వాళ్లు ఉన్నారు. లోకేష్ స్వయంగా ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయన నాయకత్వంలో పని చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు ఎంత వరకూ ముందుకు వస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

లోకేష్ లో ప్రజలను కట్టిపడేసే వాక్చాతుర్యం లేకపోవడం - ట్విటర్ కు మాత్రమే పరిమితం కావడం, ఆఖరికి ఎమ్మెల్యేగా ఓడిపోవడం.. ఇవన్నీ నెగిటివ్ పాయింట్లు అవుతున్నాయి. సరిగ్గా ఈ క్వాలిటీస్ లో ఎన్టీఆర్ చాలా ముందున్నాడు. దీంతో ఎన్టీఆర్ నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తే పార్టీలో యాక్టివేట్ అయితే తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహం రావొచ్చు.

అయితే ఎన్టీఆర్ కు చంద్రబాబు అవకాశం ఇవ్వరనేది బహిరంగ సత్యం. ఆ సంగతలా ఉంటే..ఏపీ ప్రభుత్వంతో ఎన్టీఆర్ సఖ్యతగా ఉండబోతున్నారనే ప్రచారమూ సాగుతోంది. ఏపీ ప్రభుత్వ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ నియమితం కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

ఇదే సమయంలో మరో ప్రచారం ఏమిటంటే..సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నారట ఎన్టీఆర్. ఈ మేరకు ఇప్పుడు ఒక ప్రచారం మొదలైంది. జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ను కోరుతున్నారట జూనియర్ ఎన్టీఆర్. త్వరలోనే తీరిక చూసుకుని తారక్ తో సమావేశానికి జగన్ మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ సమావేశం రీజన్ ఏదైనప్పటికీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం అది సంచలనంగా నిలిచే అవకాశాలు లేకపోలేదు!