Begin typing your search above and press return to search.

తుపాకుల నియంత్రణ బిల్లు.. జోబైడెన్ సంచలన సంతకం

By:  Tupaki Desk   |   26 Jun 2022 9:30 AM GMT
తుపాకుల నియంత్రణ బిల్లు.. జోబైడెన్ సంచలన సంతకం
X
గన్ కల్చర్ తో అట్టుడుకుత నెలలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న అమెరికాలో గొప్ప సంస్కరణకు బీజం పడింది. ఇక అగ్రరాజ్యంలో తుపాకుల విక్రయాలపై నియంత్రణ ఉండనుంది. అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టంపై అధ్యక్షుడు జోబైడెన్ చారిత్రక సంతకం చేశారు. తుపాకుల నియంత్రణకు కొన్ని దశాబ్ధాల తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద చట్టం ఇదే కావడం గమనార్హం.

బిల్లుపై చారిత్రక సంతకం చేశాక జోబైడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చట్టం చాలా మంది ప్రాణాలను కాపాడనుంది అని ప్రకటించారు. ఇటీవల టెక్సాస్ లోని బఫెలో కాల్పుల ఘటన తర్వాత ఈ బిల్లు తెరపైకి వచ్చింది. ఈ బిల్లు శుక్రవారం ప్రతినిధుల సభలో 234-193 ఓట్ల తేడాతో పాస్ అయ్యింది. బిల్లుకు అనుకూలంగా 14 మంది రిపబ్లికన్లు కూడా ఓటింగ్ చేయడం గమనార్హం.సెనెట్ లో ఆమోదం పోందిన ఈ బిల్లు ఇక అమెరికాలో తుపాకుల నియంత్రణకు ఎంతో దోహదపడనుంది.

జోబైడెన్ మాట్లాడుతూ.. జులై 11వ తేదీన బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ సభ్యులు.. అమెరికాలో తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడారని తెలిపారు. బాధితులతో కలిసి సంబరాలు జరుపుకోనున్నట్లు వెల్లడించారు. నేను అనుకున్న ప్రతి ఒక్కటీ ఈ బిల్లు ద్వారా సాధించలేనన్నారు. కాకపోతే ప్రజల ప్రాణాలను కాపాడే నిబంధనలు దీనిలో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఇది సరిపోతుందని.. వాషింగ్టన్ ఏం చేయలేదు అనుకునే సమయంలో మేము కొంత చేశామని తెలిపారు. ఒకవేళ మేము రాజీపడి ఉంటే చాలా కీలక విషయాల్లో వెనక్కి తగ్గాల్సి ఉంటుందని తెలిపారు.

-తుపాకీ నియంత్రణ చట్టంలో ఏముంది?

చట్టం ప్రకారం 21 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న తుపాకీ కొనుగోలుదారుల కోసం కఠినమైన తనిఖీలు ఉంటాయి. గృహ దుర్వినియోగానికి పాల్పడిన వారందరినీ తుపాకీలను కలిగి ఉండకుండా నిషేధించే నిబంధన విధించారు. చట్టం లొసుగులను తొలగించారు. గతంలో వారి బాధితులను వివాహం చేసుకున్న లేదా వారితో నివసించే వారికి మాత్రమే పరిమితి వర్తిస్తుంది. ఈ చట్టం ఆ రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందజేస్తుంది. అది తుపాకీలను తాత్కాలికంగా జప్తు చేయడానికి అనుమతించే చట్టాలను ఆమోదించింది. వాటిని కలిగి ఉండటం చాలా ప్రమాదకరమైనదిగా భావించే వ్యక్తుల నుండి తుపాకులను స్వాధీనం చేసుకుంటుంది.