Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : బీటెక్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన JNTUH..?

By:  Tupaki Desk   |   9 April 2020 9:30 AM GMT
కరోనా ఎఫెక్ట్ : బీటెక్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన JNTUH..?
X
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్ విధించారు. దీంతో వృత్తి - వ్యాపార - ఉద్యోగాలతో పాటు.. విద్య వ్యవస్థ పైనా తీవ్ర ప్రభావం పడింది. సరిగ్గా పరీక్షలు జరిగే సయమంలోనే కరోనా వైరస్ విజృంభిచడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ సమయంలో హైదరాబాద్‌ లోని జవహర్‌ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(JNTUH) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఇంజనీరింగ్ పరీక్షలు - విద్యార్థుల ఉత్తీర్ణత పై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సెమిస్టర్‌ కు డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే పరీక్షలు రాసిన విద్యార్థులను క్రెడిట్స్‌ తో సంబంధం లేకుండా పైతరగతులకు ప్రమోట్‌ చేస్తారు. దీని వల్ల దాదాపు 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు లాభం జరగనుంది.లాక్ డౌన్ పూర్తయ్యాక జూన్‌ లో పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సటీ కసరత్తు చేస్తోంది. అయితే, విద్యార్థులకు అప్పటి దాకా ఆన్‌ లైన్ క్లాసులు నిర్వహించాలని కాలేజీలను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 250 కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. పవర్‌ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విద్యార్థులకు మెటీరియల్ అందించాలని సూచించింది. గూగుల్ డ్రైవ్ - ఈమెయిల్ - వాట్సాప్, -స్కైప్ - జూమ్ అప్లికేషన్ల ద్వారా మెటీరియల్ అందించాలని తెలిపింది.

సాధారణంగా ఫస్టియర్‌ విద్యార్థులు సెకండియర్‌ కు వెళ్లేందుకు - సెకండియర్‌ విద్యార్థులు థర్డ్‌ ఇయర్‌ కు వెళ్లేందుకు, థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులు ఫోర్త్‌ ఇయర్‌ కు వెళ్లేందుకు అప్పటి వరకు వారు చదివిన సబ్జెక్టుల్లో కనీసం 50శాతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆ సబ్జెక్టులకు గల క్రెడిట్స్‌ ను లెక్కించి పై తరగతులకు వేళ్లేందుకు అవసరమైన క్రెడిట్స్‌ సాధిస్తే వారిని ప్రమోట్‌ చేస్తారు. లేదంటే ఆ విద్యార్థులు పై తరగతులకు వెళ్లకుండా డిటెన్షన్‌ కు గురవుతారు. ఇప్పుడు లాక్‌ డౌన్‌ కారణంగా విద్యార్థులకు సిలబస్‌ పూర్తి కాలేదు. దీనితో JNTUH ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.