జియో మరో సంచలనం.. రూ.2500కే 5జీ స్మార్ట్ ఫోన్!

Sun Oct 18 2020 20:30:32 GMT+0530 (IST)

Jio 2500k 5G smartphone

దేశంలో డిజిటల్ విప్లవాన్ని తెచ్చిన జియో టెలికాం మరో అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ఇన్నాళ్లు 4జీకే మనం ఇంతగా ఆన్ లైన్ లో మునిగితేలుతున్న వేళ 5జీ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అయ్యింది.జియో త్వరలోనే 5జీ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రూ2500-3000 రూపాయల మధ్య 5జీ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చేందుకు జియో ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

తాజాగా ఆ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘రూ.5వేల లోపు స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని జియో యోచిస్తోందని.. కానీ సేల్స్ ను బట్టి రూ.2500-3000లోపే దాన్ని విక్రయించాలని అనుకుంటోందని’ తెలిపారు.

ఇటీవలే 2జీ ముక్త భారత్ అని పిలుపునిచ్చిన జియో.. తాజాగా జరిగిన కంపెనీ మీటింగ్ లో సుమారు 20-30 కోట్ల మంది 2జీ వినియోగదారులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. వారందరినీ 4జీ 5జీలోకి తీసుకురావాలని ఈ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే 2500 రూపాయలకే 5జీ ఫోన్ వార్తలపై జియో మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.