Begin typing your search above and press return to search.

ఖాతాలో డబ్బు చోరీచేస్తే బ్యాంక్ కూడా బాధ్యత వహించాల్సిందే.?

By:  Tupaki Desk   |   13 Jan 2022 4:30 PM GMT
ఖాతాలో డబ్బు చోరీచేస్తే బ్యాంక్ కూడా బాధ్యత వహించాల్సిందే.?
X
వినియోగదారులకు ఊరటనిచ్చేలా కోర్టు తీర్పునిచ్చింది. ఖాతాలో డబ్బు చోరీచేస్తే బ్యాంక్ కూడా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి పూనమ్ శ్రీవాస్తవ బ్యాంక్ ఖాతా నుంచి ఐదు లక్షల రూపాయల సైబర్ క్రైమ్ కేసుపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకు ఖాతాల్లో నగదు ఉంటుందని.. ఆ సొమ్ము సైబర్ క్రైమ్ ద్వారా చోరీకి గురైనప్పుడు బ్యాంక్ కూడా బాధ్యత వహించాలని హైకోర్టు పేర్కొంది.

ఒకవేళ కస్టమర్ సైబర్ మోసానికి గురైతే దానికి బ్యాంకు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసే వారు దేశం పట్ల మరింత నిజాయితీగా ఉంటారని కోర్టు పేర్కొంది. వారి డబ్బు ఎప్పుడూ సురక్షితంగా ఉండాలని వ్యాఖ్యానించింది.

సైబర్ మోసానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. మాజీ జస్టిస్ పూనమ్ శ్రీవాస్తవ బ్యాంకు ఖాతా నుంచి 5 లక్షల సైబర్ మోసం జరిగింది. ఈ కేసులో వాస్తవాల ఆధారంగా సుధీర్ఘ విచారణ జరిగింది.

జార్ఖండ్ లోని సైబర్ మోసానికి సంబంధించిన నిందితుల బెయిల్ దరఖాస్తులను కూడా హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ ను తిరస్కరించిన వారిలో నీరజ్ మండల్, తపన్ మండల్, శుభోషా అ, తౌసిఫ్ పేర్లు ఉన్నాయి. ఈ సైబర్ మోసం కేసులో బాధితుడు మాజీ న్యాయమూర్తి పూనమ్ శ్రీవాస్తవ కావడం గమనార్హం.

డిసెంబర్ 4 2020న రాంచీ నుంచి పూనమ్ శ్రీవాస్తవ మొబైల్ కు కాల్ వచ్చింది. కాల్ చేస్తున్నప్పుడు సైబర్ దుండగుడు బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ కస్టమర్ నుంచి పాస్ బుక్, ఆధార్, పాన్ నంబర్ ను అడిగాడు. ఆ తర్వాత ఆయన ఖాతా నుంచి 5 లక్షల రూపాయలు డ్రా అయ్యాయి. అకౌంట్ లో డబ్బులు డ్రా కావడంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది. దీనిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. తాజాగా బ్యాంకుదీ బాధ్యత అని కోర్టు తీర్పునిచ్చింది.