Begin typing your search above and press return to search.

జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి

By:  Tupaki Desk   |   24 Sep 2021 3:30 PM GMT
జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి
X
హైదరాబాద్ లోని అసెంబ్లీకి వచ్చిన ఏపీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి క్లాస్ పీకారు తెలంగాణ ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి. ఒకప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్ లో ఉద్దండులు.. సీనియర్లు.. ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం కావడంతో జేసీ టీడీపీలో చేరారు. అయితే కాంగ్రెస్ నేతలతో ఆయన బంధం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. తరచుగా వారిని కలుస్తూనే ఉంటాడు.తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా అసెంబ్లీకి జేసీ దివాకర్ రెడ్డి వచ్చాడు. సీఎల్పీకి వెళ్లి కాంగ్రెస్ నేతలను కలిశారు.

సీఎల్పీకి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి గతంలో మీడియా ఎదుట అవాకులు చెవాకులు పేల్చాడు. ఈ క్రమంలోనే జేసీకి తాజాగా క్లాస్ పీకాడు టీ.జీవన్ రెడ్డి. ఏదైనా రాజకీయాలు మాట్లాడాలంటే సీఎల్పీ బయటే చూసుకోవాలన్నారు. ఇక్కడికొచ్చి కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.

ప్రతిసారి ఇదో అలవాటైపోయిందని.. జేసీ ఇష్టమొచ్చనట్టు మాట్లాడుతున్నారని టీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా జేసీ షాకయ్యారు. ఈ ఘటన నుంచి తేరుకున్న జేసీ వెంటనే జీవన్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం 'సారీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు'. ఏదైనా ఉంటే సీఎల్పీ బయట మాట్లాడుకోవాలని చాలా గట్టిగానే చెప్పారు జీవన్ రెడ్డి. కొంత ఇబ్బందికి గురైన జేసీ దివాకర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాను పాత మిత్రులను కలవడానికే వచ్చానని చెప్పారు.

అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ ను కలిశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సీఎల్పీకి వచ్చారు. తన పాత మిత్రులను కలవడానికే వచ్చానని చెప్పారు. అక్కడి నుంచి సీఎం ఛాంబర్ కు వెళ్లి విష్ చేసి వచ్చేశారు.

సీఎల్పీలో కలిసి వచ్చిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో హాట్ కామెంట్స్ చేశారు. 'తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానన్నారు. ఆంధ్రాను వదిలేసి తెలంగాణకు వస్తానన్నారు.'' సీఎం కేసీఆర్ ను కలిసేందుకే తాను వచ్చానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే కేసీఆర్ ను కలవలేకపోయారు. మంత్రి కేటీఆర్ ను జేసీ కలిశారు. తర్వాత కాంగ్రెస్ శాసనక్ష కార్యాలయంలో పాత మిత్రులను కలిశారు..