ఐటి కంపెనీలపై తెలంగాణా ఒత్తిడి ?

Fri Jul 30 2021 10:21:09 GMT+0530 (IST)

Telangana pressure on IT companies?

తెలంగాణాలోని ఐటి కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. వర్క్ ఫ్రం హోం పద్దతికి స్వస్తి చెప్పి ఉద్యోగులను సంస్ధలకు పిలిపించాలని ఐటి సెక్రటరీ జయేష్ రంజన్ తో ప్రభుత్వం చెప్పించింది. ఇప్పటికే చాలాకాలంగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను ఇళ్ళనుండే చేస్తున్నారని ఈ పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టి అందరినీ ఆఫీసులకు పిలిపించాలని జయేష్ ఐటి సంస్ధల మేనేజర్లతో జరిగిన సమావేశంలో గట్టిగా చెప్పారు.జయేష్ ఆలోచనతో  ప్రముఖ కంపెనీలు విభేదించాయి. తమ యాజమాన్యాల నిర్ణయం ప్రకారమే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు అందరినీ ఆఫీసులకు పిలిపించటం సాధ్యంకాదని తెగేసి చెప్పినట్లు సమాచారం. గూగుల్ కాగ్నిజెంట్ విప్రో ఫేస్ బుక్ డెలాయిట్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల యాజమాన్యాలన్నీ తమ ఉద్యోగులంతా వచ్చే అక్టోబర్ వరకు ఇళ్ళనుండే పనిచేయాలని గతంలోనే నిర్ణయించిన విషయాన్ని సంస్ధల ప్రతినిధులు జయేష్ కు గుర్తుచేశారు.

పెద్ద కంపెనీల నిర్ణయాన్ని మధ్య చిన్నతరహా కంపెనీలు కూడా ఫాలో అవుతాయని వివరించారు. పైగా ఉద్యోగులు ఇళ్ళల్లో ఉండి పనిచేసినా ఆఫీసులకు వచ్చి పనిచేసినా అవుట్ పుట్ ఒకేలా ఉందని వివరించారు. కాబట్టి ఐటి ఉద్యోగుల పని విషయంలో ఇప్పటికప్పుడు తాము నిర్ణయం తీసుకోవటం కష్టమని కూడా తెగేసిచెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. మొదటిదేమో ప్రభుత్వం యాంగిల్లో చూడటం. ఇక రెండోదేమో ఐటి కంపెనీల యాంగిల్.

ప్రభుత్వ యాంగిల్లో చూస్తే ఐటి కంపెనీల మీద ఆధారపడిన లక్షలాది మంది ఉపాధి పోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని  1500 ఐటి కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే మరో 15 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. లాక్ డౌన్ వర్క్ ఫ్రం హోం వల్ల 6 లక్షలమందికి ఇబ్బంది లేకపోయినా 15 లక్షలమందికి సమస్య మొదలైంది. సమస్యలు ఎదుర్కొంటున్న 15 లక్షలమందికి ఉపాధి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే పడింది. దాంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. అందుకనే ఐటి కంపెనీల ప్రతినిధులపై ఒత్తిడి తెస్తోంది.

ఇక ఐటి కంపెనీల యాంగిల్ చూస్తే ఉద్యోగుల వర్క్ ఫ్రం హోం వల్ల కంపెనీల యాజమాన్యాలకు చాలా ఖర్చులు మిగులుతున్నాయి. ఆఫీసు నిర్వహణ ఉద్యోగుల ట్రాన్స్ పోర్టు కరెం